వెస్టిండీస్-ఎతో అనధికారిక మూడు వన్డేల సిరీస్లో భారత్-ఎ శుభారంభం చేసినా ఈ తర్వాత వరుస పరాజయాలతో సిరీస్ను చేజార్చుకుంది. గురువారమిక్కడ జరిగిన మూడో మ్యాచ్లో కరీబియన్లు 45 పరుగులతో విజయం సాధించి 2-1తో సిరీస్ను సొంతం చేసుకున్నారు. 313 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్-ఎ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 267 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ యువరాజ్ సింగ్ (61) మరోసారి రాణించగా, అపరాజిత్ (78) హాఫ్ సెంచరీతో అకట్టుకున్నాడు. వీరిద్దరితో పాటు వినయ్ కుమార్ (37 నాటౌట్) రాణించడం మినహా ఇతర బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. యువీ, అపరాజిత్ మూడో వికెట్కు 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కాగా వీరిద్దరూ వెంటవెంటనే అవుటవడం, ఇతర బ్యాట్స్మెన్ అదే బాటపట్టడంతో భారత్ లక్ష్యం దిశగా సాగలేకపోయింది. పెరుమాళ్ మూడు, కమిన్స్ రెండు వికెట్లు తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన విండీస్.. ఎడ్వర్డ్స్ (104) సెంచరీతో చెలరేగడంతో పూర్తి ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 312 పరుగుల భారీ స్కోరు చేసింది. జాన్సన్ (54) అర్ధశతకానికి తోడు పావెల్ 40, కార్టెర్ 35 పరుగులు చేశారు. ఎడ్వర్డ్స్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పుతూ జట్టుకు భారీ స్కోరును అందించాడు. భారత యువ బౌలర్ ఉనాద్కట్ ఐదు వికెట్లు పడగొట్టాడు. నదీమ్ రెండు, వినయ్ కుమార్, అపరాజిత్ చెరో వికెట్ తీశారు.
విండీస్-ఎదే సిరీస్: మూడో వన్డేలో భారత్ బోల్తా
Published Thu, Sep 19 2013 6:05 PM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM
Advertisement