కఠ్మాండు (నేపాల్): దక్షిణాసియా క్రీడల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత పురుషుల వాలీబాల్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 27–25, 25–19, 21–25, 25–21తో శ్రీలంకపై విజయం సాధించింది. మరో సెమీస్‌లో పాకిస్తాన్ 25–15, 25–21, 26–24తో బంగ్లాదేశ్‌ను ఓడించింది. దీంతో దాయాది దేశాలైన భారత్, పాక్‌ల మధ్య వాలీబాల్ టైటిల్ పోరు జరగనుంది.
మహిళల విభాగంలోనూ డిఫెండింగ్ చాంపియన్ అయిన భారత్ తుదిపోరులో నేపాల్‌తో తలపడుతుంది. ఈ రెండు మ్యాచ్‌లు మంగళవారం జరుగుతాయి. సెమీస్‌లో మహిళల జట్టు మాల్దీవులపై నెగ్గగా, శ్రీలంకపై నేపాల్ గెలిచింది. పలు క్రీడాంశాల్లో పోటీలు మొదలైనప్పటికీ ఆరం¿ోత్సవ వేడుకలు మాత్రం ఆదివారం లాంఛనంగా జరిగాయి. నేపాల్ దేశాధ్యక్షురాలు విద్యాదేవి భండారి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఈ క్రీడలను ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నేపాలీ సంప్రదాయ శైలీలో అట్టహాసంగా వేడుకల్ని నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment