ఐదు వందలు... మూడు వికెట్లు... | India Declared Their First Innings At 502 Runs For The Loss Of 7 Wickets | Sakshi
Sakshi News home page

ఐదు వందలు... మూడు వికెట్లు...

Published Fri, Oct 4 2019 2:22 AM | Last Updated on Fri, Oct 4 2019 4:48 AM

 India Declared Their First Innings At 502 Runs For The Loss Of 7 Wickets - Sakshi

అనూహ్యం ఏమీ జరగలేదు. అంతా అనుకున్నట్లుగానే సాగుతోంది. స్వదేశంలో తిరుగులేని జట్టయిన టీమిండియా తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో తొలి టెస్టును శాసిస్తోంది. ముందుగా బ్యాటింగ్‌లో చెలరేగి 500కు పైగా పరుగులు సాధించిన అనంతరం గంట పాటు సాగిన ఆటలో మూడు ప్రత్యర్థి వికెట్లు పడగొట్టి ఆధిపత్యం ప్రదర్శించింది. తమ దూకుడును రోహిత్, మయాంక్‌ రెండో రోజు కొనసాగించడంతో భారీ స్కోరు సాధ్యమైంది.

మయాంక్‌ తన తొలి టెస్టు శతకాన్నే డబుల్‌ సెంచరీగా మలచుకోగా, రోహిత్‌ డబుల్‌ అవకాశాన్ని కోల్పోయాడు. కోహ్లి సహా ఇతర భారత బ్యాట్స్‌మెన్‌ అందరూ విఫలమైనా ఓపెనర్లు చేసిన పరుగులు జట్టుకు సరిపోయాయి. అనంతరం అశ్విన్, జడేజా స్పిన్‌కు సఫారీలు అల్లాడారు. తొలి బంతి నుంచే తడబడిన దక్షిణాఫ్రికా మూడో రోజు ఎంత సేపు నిలబడగలదో చూడాలి.   

విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజే భారత్‌కు పట్టు చిక్కింది. వర్షం ఏమాత్రం అంతరాయం కలిగించకపోవడంతో 96.5 ఓవర్ల ఆట సాధ్యమైన గురువారం టీమిండియాకు అంతా కలిసొచి్చంది. భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 502 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (371 బంతుల్లో 215; 23 ఫోర్లు, 6 సిక్సర్లు) ద్విశతకం సాధించగా,  రోహిత్‌ శర్మ (244 బంతుల్లో 176; 23 ఫోర్లు, 6 సిక్సర్లు) తన ఓవర్‌నైట్‌ స్కోరుకు మరో 61 పరుగులు జోడించడం విశేషం. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 39 పరుగులే చేయగలిగింది. డీన్‌ ఎల్గర్‌ (27 బ్యాటింగ్‌), బవుమా (2 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉండగా ఆ జట్టు ప్రస్తుతం మరో 463 పరుగులు వెనుకబడి ఉంది.  

తొలి సెషన్‌: కొనసాగిన జోరు
తొలి రోజు ప్రదర్శించిన జోరును భారత ఓపెనర్లు రెండో రోజూ కొనసాగించారు. ఆత్మవిశ్వాసంతో, సాధికారికంగా రోహిత్, మయాంక్‌ షాట్లు కొట్టడంతో పరుగులు చకచకా వచ్చాయి. 125 పరుగుల వద్ద రోహిత్‌ ఇచి్చన క్యాచ్‌ను డి కాక్‌ వదిలేసి మేలు చేశాడు. కొద్ది సేపటికే మహరాజ్‌ బౌలింగ్‌లో సింగిల్‌ తీయడంతో మయాంక్‌ తొలి సెంచరీ పూర్తయింది. ఏ జట్టు నుంచైనా ఇద్దరు ఓపెనర్లు దక్షిణాఫ్రికాపై సెంచరీలు చేయడం 2009 తర్వాత ఇదే తొలిసారి. ఆ తర్వాత దూకుడు పెంచిన రోహిత్‌ 224 బంతుల్లో 150 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అనంతరం రోహిత్‌ వికెట్‌ తీసి ఎట్టకేలకు సఫారీలు ఊపిరి పీల్చుకున్నారు. మహరాజ్‌ ఓవర్లో వరుసగా 6, 4 బాదిన రోహిత్‌ తర్వాతి బంతిని అంచనా వేయడంలో విఫలమై స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. ఈ సెషన్‌లో భారత్‌ 4.2 రన్‌రేట్‌తో పరుగులు చేయడం విశేషం.  
ఓవర్లు: 28.5, పరుగులు: 122, వికెట్లు: 1

రెండో సెషన్‌: సఫారీ బౌలర్ల రాణింపు
లంచ్‌ తర్వాత తొలి బంతికే పుజారా (17 బంతుల్లో 6; ఫోర్‌)ను క్లీన్‌ »ౌల్డ్‌ చేసి ఫిలాండర్‌ తమ జట్టుకు సరైన ఆరంభాన్ని అందించాడు. రబడ ఓవర్లో ఫోర్‌తో మయాంక్‌ కూడా 150 పరుగులు మార్క్‌ను చేరుకోగా... మరోవైపు భారత్‌ తక్కువ వ్యవధిలో వికెట్లు కోల్పోయింది. ముత్తుసామి తొలి టెస్టు వికెట్‌గా కోహ్లి (40 బంతుల్లో 20; 4 ఫోర్లు) వెనుదిరిగాడు. అతను వేసిన బంతిని బద్ధకంగా ఆడే ప్రయత్నం చేసిన భారత కెపె్టన్‌ బౌలర్‌కే రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చాడు. మహరాజ్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో 190ల్లోకి అడుగు పెట్టిన మయాంక్‌... మరి కొద్దిసేపటికి మహరాజ్‌ బౌలింగ్‌లోనే లాంగాఫ్‌ దిశగా రెండు పరుగులు రాబట్టి 358 బంతుల్లో డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రహానే (43 బంతుల్లో 15; 2 ఫోర్లు) మరోసారి విఫలమయ్యాడు. చివరకు పార్ట్‌టైమర్‌ ఎల్గర్‌తో బౌలింగ్‌ చేయించిన దక్షిణాఫ్రికా ఫలితం రాబట్టింది. అతని తొలి ఓవర్లోనే భారీ షాట్‌కు ప్రయతి్నంచి అవుట్‌ కావడంతో మయాంక్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ముగిసింది. తొలి రోజు వృథా అయిన సమయాన్ని సరిదిద్దే క్రమంలో ఈ సెషన్‌ను అదనంగా అరగంట పొడిగించారు.  
ఓవర్లు: 36, పరుగులు: 126, వికెట్లు: 4

మూడో సెషన్‌: అశి్వన్‌ శుభారంభం  
టీ విరామం తర్వాత భారత్‌ వేగంగా పరుగులు జోడించి ఆటను ముగించాలని భావించింది. ఈ క్రమంలో విహారి (10; ఫోర్‌), సాహా (21; 4 ఫోర్లు) తక్కువ వ్యవధిలోనే వెనుదిరిగారు. రవీంద్ర జడేజా (30 నాటౌట్‌; సిక్స్‌) కొన్ని కీలక పరుగులు జత చేశాడు. స్కోరు 500 పరుగులు దాటిన తర్వాత కోహ్లి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. దక్షిణాఫ్రికా భయపడినట్లుగానే భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం జట్టు బ్యాట్స్‌మెన్‌కు సంకటంగా మారింది. నాలుగో ఓవర్లోనే అశి్వన్‌ను భారత్‌ బౌలింగ్‌కు దించడం ఫలితాన్నందించింది. చక్కటి బంతితో మార్క్‌రమ్‌ (5)ను క్లీన్‌»ౌల్డ్‌ చేసిన అశ్విన్, డి బ్రూయిన్‌ (4)నూ ఔట్‌ చేశాడు. నైట్‌ వాచ్‌మన్‌ డేన్‌ పీట్‌ (0)ను జడేజా బౌల్డ్‌ చేయగా, అదే ఓవర్లో బవుమా ఇచి్చన క్యాచ్‌ను షార్ట్‌లెగ్‌లో విహారి పట్టి ఉంటే ఆ జట్టు మరో వికెట్‌ కోల్పోయేది.
ఓవర్లు: 12 (భారత్‌), పరుగులు: 52, వికెట్లు: 2
ఓవర్లు: 20 (దక్షిణాఫ్రికా), పరుగులు: 39, వికెట్లు: 3

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మయాంక్‌ (సి) పీట్‌ (బి) ఎల్గర్‌ 215; రోహిత్‌ (స్టంప్డ్‌) డి కాక్‌ (బి) మహరాజ్‌ 176; పుజారా (బి) ఫిలాండర్‌ 6; కోహ్లి (సి అండ్‌ బి) ముత్తుసామి 20; రహానే (సి) బవుమా (బి) మహరాజ్‌ 15; జడేజా (నాటౌట్‌) 30; విహారి (సి) ఎల్గర్‌ (బి) మహరాజ్‌ 10; సాహా (సి) ముత్తుసామి (బి) పీట్‌ 21; అశి్వన్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (136 ఓవర్లలో 7 వికెట్లకు డిక్లేర్డ్‌) 502

వికెట్ల పతనం: 1–317, 2–324, 3–377, 4–431, 5–436, 6–457, 7–494.  

బౌలింగ్‌: ఫిలాండర్‌ 22–4–68–1, రబడ 24–7–66–0, మహరాజ్‌ 55–6–189–3, పీట్‌ 19–1–107–1, ముత్తుసామి 15–1–63–1, ఎల్గర్‌ 1–0–4–1.

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: ఎల్గర్‌ (బ్యాటింగ్‌) 27; మార్క్‌రమ్‌ (బి) అశి్వన్‌ 5; డి బ్రూయిన్‌ (సి) సాహా (బి) అశ్విన్‌ 4; పీట్‌ (బి) జడేజా 0; బవుమా (బ్యాటింగ్‌) 2; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు)

39.  వికెట్ల పతనం: 1–14, 2–31, 3–34.    

బౌలింగ్‌: ఇషాంత్‌ 2–0–8–0 , షమీ 2–2–0–0, అశి్వన్‌ 8–4–9–2, జడేజా 8–1–21–1.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement