రోహిత్ ,ధావన్
కొలంబో: టి20 మ్యాచ్‌లో మోస్తరు లక్ష్యం నిర్దేశించి... విజయం సాధించాలంటే పటిష్ట బౌలింగ్ వనరులుండాలి. ఇలా కాకుంటే భారీ స్కోరు చేసి ప్రత్యర్థిని ముందే ఒత్తిడికి గురిచేయాలి. మొదటి మ్యాచ్‌లో లంకపై రోహిత్ సేన ఈ రెండూ చేయలేక ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్‌లో సాదాసీదా ప్రదర్శన... తర్వాత పస లేని బౌలింగ్‌తో మ్యాచ్ చేజారింది. ఈ నేపథ్యంలో గురువారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ మెరుపులూ తోడైతేనే టీమిండియాది పైచేయి అవుతుంది.
స్కోరు 200 దాటాలి...
ముందుగా బ్యాటింగ్‌కు దిగితే కనీసం 200 పరుగులు చేయాలి. ప్రస్తుత మన బౌలింగ్ పరిమితులరీత్యా ఈ స్థాయి స్కోరుంటేనే గెలుపుపై నిశ్చింతగా ఉండగలం. దీనికి పునాది వేయాల్సింది కెప్టెన్ రోహిత్ శర్మనే. పేలవ ఫామ్ నుంచి అతడు త్వరగా బయటపడి... అద్భుతంగా ఆడుతున్న మరో ఓపెనర్ ధావన్‌కు తోడైతే ఇదేమంత కష్టం కాదు. బౌలింగ్‌లో తొలి మ్యాచ్‌లో సుందర్ మినహా అందరూ తేలిపోయారు. పేసర్లు శార్దుల్, ఉనాద్కట్ ప్రభావం చూపకపోవడంతో పార్ట్ టైమర్లను ఆశ్రయించాల్సి వచ్చింది. వీరితో పాటు చహల్ కూడా గాడిన పడాల్సిన అవసరం ఉంది. ఎడమచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో విజయ్ శంకర్ బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. ఈ ఒక్కటి తప్ప మార్పులు ఉండకపోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment