
టోక్యో: అంతర్జాతీయ హాకీ సమాఖ్య టోక్యో ఒలింపిక్స్‌కు సంబంధించి ఈవెంట్ షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది. వచ్చే ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు టోక్యో ఒలింపిక్స్ జరగనున్నాయి. జూలై 24న ప్రారంభోత్సవం తర్వాత ఈవెంట్స్ మొదలయ్యే తొలి రోజు 25న హాకీ మ్యాచ్‌లు మొదలవుతాయి. అదే రోజు తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత పురుషుల జట్టు... నెదర్లాండ్స్‌తో భారత మహిళల జట్టు ఆడతాయి. గ్రూప్ ‘ఎ’లో ఉన్న భారత పురుషుల జట్టు తర్వాతి మ్యాచ్‌ల్లో ఆ్రస్టేలియా (జూలై 26న), స్పెయిన్ (జూలై 28న), అర్జెంటీనా (జూలై 30న), జపాన్ (జూలై 31న) జట్లతో ఆడుతుంది. గ్రూప్ ‘ఎ’లోనే ఉన్న భారత మహిళల జట్టు తదుపరి మ్యాచ్‌ల్లో జర్మనీ (జూలై 27న), బ్రిటన్ (జూలై 29న), ఐర్లాండ్ (జూలై 31న), దక్షిణాఫ్రికా (ఆగస్టు 1న) జట్లతో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment