
భారత్, పాక్ మ్యాచ్ నేడు
వరల్డ్‌కప్‌లో హై టెన్షన్ పోరు!
వంద మ్యాచ్‌లలో ఓడినా.. ఆ ఒక్క విజయం ఇచ్చే కిక్కు వేరు...
వెయ్యి మ్యాచ్‌లు ఆడినా.. పాక్‌తో జరిగే ఆ ఒక్క పోరు వేరు...
ప్రపంచకప్ సోయగానికి ప్రతీకగా నిలిచే ఆ మ్యాచ్ కోసం...
ఊహ తెలిసిన బుడ్డోడి నుంచి పండు ముదుసలి వరకు...
సామాన్యుడి నుంచి కార్పొరేట్స్ వరకు.. ఎదురుచూస్తున్నారు....
మదిలో పదిలమైన భావాలను తరచి చూస్తూ... జ్ఞాపకాల దొంతరలో అమరిపోయిన అద్భుత ఘట్టాలను ఆవిష్కరిస్తూ... మళ్లీ వచ్చింది... మన ప్రియమైన శత్రువుతో మరో పోరు.
ప్రపంచకప్‌లో రెండు దశాబ్దాలకు పైగా పాకిస్తాన్‌పై కొనసాగుతున్న అప్రతిహత జైత్రయాత్రలో మరో అంకానికి నేడు (ఆదివారం) తెరలేవనుంది. క్షణక్షణం... అనుక్షణం... కంటికి కనుపాప కూడా అడ్డొస్తుందేమోనన్న కలవరంతో క్రికెట్ ప్రపంచం ఊపిరి బిగబట్టి మ్యాచ్‌ను ఆస్వాదించేందుకు సమయం ఆసన్నమైంది. ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. ఇక టీవీలకు అతుక్కుపోండి..!
ఉదయం 9.00 గంటల నుంచి
స్టార్ స్పోర్ట్స్-1,డీడీలో ప్రత్యక్ష ప్రసారం