
బాధను దిగమింగి...
సచిన్ వంద శతకాలు బాది ఉండొచ్చు. కానీ ఆ సెంచరీ ప్రత్యేకం. 1999 ప్రపంచకప్‌లో బ్రిస్టల్‌లో చేసిన సెంచరీ ఎప్పటికీ అభిమానులకు గుర్తుండిపోతుంది. ఈ మ్యాచ్‌కు ముందు తండ్రి మరణించడంతో సచిన్ స్వదేశం తిరిగొచ్చాడు. సచిన్ గైర్హాజరీలో ఆడిన భారత్, అనూహ్యంగా జింబాబ్వే చేతిలో ఓడింది. అంత్యక్రియలు ముగిసిన అనంతరం జాతి ఆశలు మోస్తూ సచిన్ మళ్లీ ఇంగ్లండ్‌కు వచ్చాడు. కెన్యాతో జరిగిన తర్వాతి మ్యాచ్‌లో 101 బంతుల్లో 140 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు.
ప్రత్యర్థి బలహీనమైనదే కావచ్చు, కానీ ఆ సమయంలో మాస్టర్ తన మనసులోని సంఘర్షణల నడుమ చేసిన ఆ శతకం ఎప్పటికీ ప్రత్యేకం. సెంచరీ చేయగానే తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఆకాశం వైపు బ్యాట్ చూపించడం అభిమానులు ఎన్నటికీ మరచిపోలేరు. ఆ తర్వాత సచిన్‌కు అదే అలవాటుగా మారిపోయింది.