త్వరలో భారత్, పాక్ క్రికెట్ సిరీస్! | India, pakisthan cricket series may be in december | Sakshi
Sakshi News home page

త్వరలో భారత్, పాక్ క్రికెట్ సిరీస్!

May 11 2015 3:05 PM | Updated on Jul 25 2018 1:49 PM

త్వరలో భారత్, పాక్ క్రికెట్ సిరీస్! - Sakshi

త్వరలో భారత్, పాక్ క్రికెట్ సిరీస్!

భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్ అంటే ఇరు దేశాల్లో అమితాసక్తి.

ముంబై: భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్ అంటే ఇరు దేశాల్లో అమితాసక్తి. సుదీర్ఘ విరామం తర్వాత దాయాది జట్లు ద్వైపాక్షిక సిరీస్ ఆడే అవకాశముంది. వచ్చే డిసెంబర్లో భారత్, పాక్ మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్.. బీసీసీఐ అధ్యక్షుడు జగన్మోహన్ దాల్మియాతో సమావేశమై ఈ మేరకు చర్చలు జరిపారు. పాక్లో భారత్ జట్టు పర్యటించాల్సిందిగా ఆయన దాల్మియాను విజ్ఞప్తి చేశారు. ఇందుకు బీసీసీఐ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఐపీఎల్లో ఆడేందుకు పాక్ క్రికెటర్లను అనుమతించాలని పీసీబీ చీఫ్ దాల్మియాను కోరారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల అనంతరం భారత్, పాక్ మధ్య క్రీడా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఐసీసీ ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ కప్ వంటి టోర్నీల్లో దాయాది జట్లు ఆడటం మినహా ద్వైపాక్షిక సిరీస్లో ఆడలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement