దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా హాంకాంగ్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టీమీండియా ఓపెనర్ శిఖర్ ధావన్ శతక్కొట్టడంతో భారత్ పసికూనకు 286 లక్ష్యాన్ని నిర్ధేశించింది. భారత్ మిడిలార్డర్ మరోసారి విఫలమైంది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్‌కు ఓపెనర్ రోహిత్ శర్మ (23) నిరాశ పరిచనప్పటికి ధావన్, అంబటి రాయుడు సాయంతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 116 పరుగులు జోడించిన అనంతరం రాయుడు (60) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్‌తో ధావన్ దాటిగా ఆడాడు. ఈ క్రమంలో 105 బంతుల్లో 13 ఫోర్లతో కెరీర్‌లో 14 సెంచరీ సాధించాడు.
అనంతరం రెండు సిక్స్‌లు బాది దాటిగా ఆడే ప్రయత్నం చేసిన ధావన్ (127) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ఎంఎస్ ధోని డకౌట్‌గా నిష్క్రమించి తీవ్రంగా నిరాశపరిచాడు. ఆ వెంటనే దినేశ్ కార్తీక్(33) కూడా ఔటవ్వడంతో భారత్ పరుగుల వేగం నెమ్మదించింది. చివర్లో చెలరేగిన హాంకాంగ్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్ (9), శార్ధుల్ ఠాకుర్(0)లను పెవిలియన్ చేర్చారు. దీంతో ఆచితూచి ఆడుతూ కేదార్ జాదవ్(25 నాటౌట్) వికెట్లు పడకుండా జాగ్రత్తపడ్డాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment