
శిఖర్ ధావన్
దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా పసికూన హాంకాంగ్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీతో చెలరేగాడు. ఇంగ్లండ్ పర్యటనలో దారుణంగా విఫలమైన ధావన్ ఎట్టేకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (23) వికెట్‌ను త్వరగా కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడుతో ధావన్ ఆచితూచి ఆడాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 116 పరుగులు జోడించిన అనంతరం రాయుడు (60) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్‌తో ధావన్ దాటిగా ఆడాడు.
ఈ క్రమంలో 105 బంతుల్లో 13 ఫోర్లతో కెరీర్‌లో 14 సెంచరీ సాధించాడు. అనంతరం రెండు సిక్స్‌లు బాది దాటిగా ఆడే ప్రయత్నం చేసిన ధావన్ (127) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 241/3 కాగా క్రీజులో కార్తీక్(28), ధోని(0)లున్నారు.
Comments
Please login to add a commentAdd a comment