న్యూఢిల్లీ: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో పరాజయం పొందిన భారత జట్టు ప్రపంచకప్ జూనియర్ హాకీ టోర్నమెంట్‌లో పదో స్థానంతో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో పాకిస్థాన్ టైబ్రేక్‌లో 4-2 గోల్స్ తేడాతో భారత్‌ను ఓడించి తొమ్మిదో స్థానాన్ని దక్కించుకుంది. నిర్ణీత సమయానికి రెండు జట్లు 1-1వద్ద సమంగా నిలిచాయి. ఆట ఏడో నిమిషంలో రిజ్వాన్ అలీ గోల్‌తో పాక్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
66వ నిమిషంలో గుర్జిందర్ సింగ్ చేసిన గోల్‌తో భారత్ స్కోరును సమం చేసింది. టైబ్రేక్‌లో పాకిస్థాన్ తరఫున ఇర్ఫాన్ మహ్మద్, తౌసిక్ మహ్మద్, మహ్మద్ ఉమర్ భుట్టా, దిల్‌బర్ మహ్మద్ బంతిని లక్ష్యానికి చేర్చగా... రిజ్వాన్ జూనియర్ విఫలమయ్యాడు. భారత్ తరఫున గుర్జిందర్ సింగ్, తల్విందర్ సింగ్ సఫలం కాగా... ఇమ్రాన్ ఖాన్, సత్బీర్ సింగ్ విఫలమయ్యారు. ఫలితం రావడంతో భారత్ తరఫున మన్‌ప్రీత్ సింగ్ చివరిదైన ఐదో షాట్‌ను తీసుకోలేదు.
భారత్‌కు పదో స్థానం
Published Sun, Dec 15 2013 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM
Advertisement