♦ ఆజ్లాన్ షా కప్ బరిలోకి భారత్
♦ తొలి మ్యాచ్‌లో కొరియాతో ఢీ
ఇపో (మలేసియా) : ఆసియా క్రీడల్లో చాంపియన్‌గా నిలిచిన భారత హాకీ జట్టు రియో డి జనీరో ఒలింపిక్స్ (2015)కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. దీంతో పెద్ద అడ్డంకిని అధిగమించిన సర్దార్ సింగ్ సేన... నేటి (ఆదివారం) నుంచి జరిగే ఆజ్లాన్ షా కప్ హాకీ టోర్నీని ఒలింపిక్స్‌కు సన్నాహకంగా ఉపయోగించుకోవాలనుకుంటోంది. ముఖ్యంగా జట్టులోని యువ ఆటగాళ్ల ప్రావీణ్యాన్ని పరీక్షించుకోవాల్సి ఉంది. ఆరు దేశాలు ఆడే ఈ టోర్నీలో... అందుబాటులో ఉన్న పటిష్ట జట్టునే బరిలోకి దింపుతామని టీమ్ మేనేజిమెంట్ చెబుతోంది.
మరోవైపు నూతన కోచ్ పాల్ వాన్ ఆస్‌కు జట్టు తరఫున ఇదే తొలి అంతర్జాతీయ టోర్నీ కావడంతో ఆయనపై కూడా కాస్త ఒత్తిడి ఉంది. ఆటగాళ్లతో ఇప్పటికే కావాల్సినంత సమయం గడిపానని, వారి లోపాలను తెలుసుకున్నట్టు ఆయన చెప్పారు. ఆదివారం నాటి ప్రారంభ మ్యాచ్‌లోనే భారత్.. పటిష్ట కొరియా జట్టును ఢీకొనాల్సి ఉంది. యువ స్ట్రయికర్ ఆకాశ్‌దీప్ సింగ్, పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్స్ వీఆర్ రఘునాథ్, రూపిందర్ పాల్ సింగ్ రాణింపుపై జట్టు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. టోర్నీలో డిఫెండింగ్ చాంప్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేసియా, కెనడా జట్లు కూడా బరిలోకి దిగుతున్నాయి.
ఒలింపిక్స్ సన్నాహకాలే లక్ష్యంగా...
Published Sun, Apr 5 2015 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM
Advertisement
Advertisement