
వన్డే సిరీస్ టీమిండియా కైవసం
విశాఖ: న్యూజిలాండ్తో ఇక్కడ జరిగిన చివరిదైన ఐదో వన్డేలో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. సమిష్టి రాణింపుతో 3-2తో మహేంద్రసింగ్ ధోనీ నేతృత్వంలోని టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. తొలుత బ్యామ్స్ మన్ రోహిత్ శర్మ(70), విరాట్ కోహ్లీ(65) హాఫ్ సెంచరీలతో భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది. భారత్ నిర్దేశించిన 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేదు. తీవ్ర ఒత్తిడిలో బ్యాటింగ్ చేసిన కివీస్, టీమిండియా స్పిన్నర్ అమిత్ మిశ్రా(5/18) స్పిన్ మాయాజాలంతో దారుణంగా దెబ్బతీశాడు. దీంతో కివీస్ 79 పరుగులకే ఆలౌట్ కావడంతో నిర్ణయాత్మక వన్డేలో భారత్ 190 పరుగులతో విజయాన్ని సాధించింది.
ఉమేశ్ యాదవ్ తొలి ఓవర్లోనే ఓపెనర్ గప్టిల్ ను ఖాతా తెరవకుండానె ఔట్ చేశాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో బుమ్రా బౌలింగ్ లో మరో ఓపెనర్ లాథమ్(19) జయంత్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. ఓ దశలో 60/2తో ఉన్న కివీస్ కెప్టెన్ విలియమ్సన్(27) ఔట్ అయిన తర్వాత కివీస్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేదు. స్పిన్నర్లు మిశ్రా, అక్షర్ పటేల్ రాణించడంతో కివీస్ బ్యాట్స్ మన్ ఒక్కొక్కరుగా పెవిలియన్ బాట పట్టడంతో చివరి వన్డేలో భారత్ విజయఢంకా మోగించింది.