fifth one day
-
అమిత్ మిశ్రా అరుదైన రికార్డు
విశాఖ: న్యూజిలాండ్ తో జరిగిన చివరిదైన ఐదో వన్డేలో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన స్పిన్నర్ అమిత్ మిశ్రా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కించుకున్నాడు. ఇక్కడ జరిగిన మ్యాచ్ లో మిశ్రా ఆరు ఓవర్లు వేయగా అందులో 2 మెయిడిన్ ఓవర్లు ఉన్నాయి. కాగా, 18 పరుగులే ఇచ్చిన మిశ్రా ఐదు వికెట్లు తీసి కివీస్ పతనాన్ని శాసించాడు. 15 ఓవర్ల వరకు పరవాలేదు అనుకున్న కివీస్ ఇన్నింగ్స్ మిశ్రా రంగంలోకి దిగాక పరిస్థితి మారిపోయింది. న్యూజిలాండ్ తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా మిశ్రా(15 వికెట్లు) నిలిచాడు. గతంలో షేన్ వార్న్, డారెన్ గాఫ్, సునీల్ నరైన్ లు 13 వికెట్లతో ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును బ్రేక్ చేశాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్ నుంచి కివీస్ ఆటగాళ్ల తీరు సైకిల్ స్టాండ్ ను తలపించింది. అందుకు కారణం స్పిన్నర్ మిశ్రా. 16వ ఓవర్లో రెండు వికెట్లు తీసి బ్రేక్ ఇచ్చాడు. ఆ ఓవర్ నాలుగో బంతికి రాస్ టేలర్(19) ని, చివరి బంతికి వాట్లింగ్(0)ను క్లీన్ బౌల్డ్ చేసి భారత్ ను ఆధిక్యంలోకి తెచ్చాడు. తన అద్బుత బంతులతో కివీస్ ఆటగాళ్లను గింగిరాలు తిప్పిన మిశ్రా.. ఆ తర్వాత నీషమ్, టీమ్ సౌథీ, సోదీలను కూడా ఔట్ చేసి ఐదు వికెట్ల ఘనత(5/18) దక్కించుకున్నాడు. ఐదుగురు కివీస్ బ్యాట్స్ మన్ ఖాతా తెరవకుండానే డకౌట్ అవగా, అందులో ముగ్గురిని మిశ్రా పెవిలియన్ కు చేర్చాడు. -
వన్డే సిరీస్ టీమిండియా కైవసం
-
వన్డే సిరీస్ టీమిండియా కైవసం
విశాఖ: న్యూజిలాండ్‌తో ఇక్కడ జరిగిన చివరిదైన ఐదో వన్డేలో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. సమిష్టి రాణింపుతో 3-2తో మహేంద్రసింగ్ ధోనీ నేతృత్వంలోని టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. తొలుత బ్యామ్స్ మన్ రోహిత్ శర్మ(70), విరాట్ కోహ్లీ(65) హాఫ్ సెంచరీలతో భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది. భారత్ నిర్దేశించిన 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేదు. తీవ్ర ఒత్తిడిలో బ్యాటింగ్ చేసిన కివీస్, టీమిండియా స్పిన్నర్ అమిత్ మిశ్రా(5/18) స్పిన్ మాయాజాలంతో దారుణంగా దెబ్బతీశాడు. దీంతో కివీస్ 79 పరుగులకే ఆలౌట్ కావడంతో నిర్ణయాత్మక వన్డేలో భారత్ 190 పరుగులతో విజయాన్ని సాధించింది. ఉమేశ్ యాదవ్ తొలి ఓవర్లోనే ఓపెనర్ గప్టిల్ ను ఖాతా తెరవకుండానె ఔట్ చేశాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో బుమ్రా బౌలింగ్ లో మరో ఓపెనర్ లాథమ్(19) జయంత్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. ఓ దశలో 60/2తో ఉన్న కివీస్ కెప్టెన్ విలియమ్సన్(27) ఔట్ అయిన తర్వాత కివీస్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేదు. స్పిన్నర్లు మిశ్రా, అక్షర్ పటేల్ రాణించడంతో కివీస్ బ్యాట్స్ మన్ ఒక్కొక్కరుగా పెవిలియన్ బాట పట్టడంతో చివరి వన్డేలో భారత్ విజయఢంకా మోగించింది. -
కివీస్‌కు కష్టమే?
విశాఖ:న్యూజిలాండ్‌తో ఇక్కడ జరుగుతున్న చివరి వన్డేలో భారత్ నిర్దేశించిన లక్ష్యం 270. ఇది ఛేదించే లక్ష్యమే అయినప్పటికీ, ప్రస్తుత వాతావరణం, పిచ్ కండిషన్‌ను బట్టి చూస్తే కివీస్‌కు అంత ఈజీ కాదనే అనిపిస్తోంది. మరి ఈ లక్ష్యాన్ని కివీస్ సాధిస్తుందా? లేక భారత్ తన స్కోరును కాపాడుకుని సిరీస్‌ను కైవసం చేసుకుంటుందా? అనేది చూడాల్సిందే. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నభారత్ జట్టుకు రోహిత్ శర్మ-అజింక్యా రహానేలు జోడి మంచి ఆరంభాన్ని అందించారు. కాగా, రహానే(20) తొలి వికెట్‌గా వెనుదిరిగినా, రోహిత్-విరాట్ కోహ్లిల జోడి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లింది. ఈ జోడి 79 పరుగుల భాగస్వామ్యం జోడించిన తరువాత రోహిత్ శర్మ (70;65 బంతుల్లో 5 ఫోర్లు,3 సిక్సర్లు)రెండో వికెట్ గా అవుటయ్యాడు. ఆపై విరాట్-కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిల జోడి స్కోరు బోర్డులో వేగం పెంచింది. అయితే ధోని(41;59 బంతుల్లో 4 ఫోర్లు,1 సిక్స్) హాఫ్ సెంచరీకి చేరువగా వచ్చిన సమయంలో సాంట్నార్ బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయాడు. ఆ తరువాత క్రీజ్‌లోకి వచ్చిన మనీష్ పాండే డకౌట్‌గా అవుటయ్యాడు. మరికొద్ది సేపటికి విరాట్(65;76 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్) కూడా నిష్ర్కమించడంతో భారత స్కోరు బోర్డులో వేగం కాస్త తగ్గింది. చివరి 10 ఓవర్లలో భారత్ రెండు వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. అక్షర్ పటేల్(24), కేదర్ జాదవ్(39) ఫర్వాలేదనిపించడంతో భారత జట్టు 50.0 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్, సోథీ తలో రెండు వికెట్లు సాధించగా, నీషమ్, సాంట్నార్లకు చెరో వికెట్ కు దక్కింది. -
భారీ స్కోరు దిశగా టీమిండియా
విశాఖ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరిదైన ఐదో వన్డేలో భారత్ జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు 30.0ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 154 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత జట్టులో రోహిత్ శర్మ(70;65 బంతుల్లో5 ఫోర్లు, 3 సిక్సర్లు)తో రాణించగా, అజింక్యా రహానే(20) మోస్తరుగా ఫర్వాలేదనిపించాడు. తొలి వికెట్‌కు రహానే అవుటైన తరువాత రోహిత్-విరాట్ కోహ్లిల జోడి స్కోరును ముందకు తీసుకెళ్లింది. ఈ క్రమంలోనే రోహిత్ హాఫ్ సెంచరీ సాధించాడు. కోహ్లితో కలిసి 79 పరుగులు జోడించిన రోహిత్ రెండో వికెట్ గా అవుటయ్యాడు. గత నాలుగు వన్డేల్లో కలుపుకుని 53 పరుగులే చేసిన రోహిత్.. కీలకమైన ఈ మ్యాచ్‌లో మాత్రం ఆకట్టుకున్నాడు. రోహిత్ అవుటైన తరువాత విరాట్‌తో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జత కలవడంతో పరుగుల వేగం ఊపందుకుంది. -
జయంత్ యాదవ్ అరంగేట్రం
విశాఖ: న్యూజిలాండ్‌తో ఇక్కడ డా.వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న చివరిదైన ఐదో వన్డేలో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌లో సమంగా నిలవడంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. గత మ్యాచ్‌లో గెలిచిన న్యూజిలాండ్‌ను ఎలాగైనా నిలువరించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ధోని సేన భావిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ నాల్గో వన్డేలో విజయంతో రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. భారత జట్టులో తిరిగి జస్ర్పిత్ బూమ్రా తిరిగి జట్టులో చేరగా, ధవల్ కులకర్ణి రిజర్వ్ బెంచ్‌కు పరిమితమయ్యాడు. మరోవైపు హరియాణా ఆటగాడు జయంత్ యాదవ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. దాంతో హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినిచ్చారు. ఇదిలా ఉండగా, న్యూజిలాండ్ తుది జట్టులో కోరీ అండర్సన్ చేరాడు. ఇప్పటివరకూ వైజాగ్‌లో భారత జట్టు ఐదు వన్డేలు ఆడింది. ఇందులో నాలుగింట విజయం సాధించిన టీమిండియా.. ఒకదాంట్లో మాత్రమే ఓటమి పాలైంది. 2005లో ఇక్కడ జరిగిన మొట్టమొదటి వన్డేలో పాకిస్తాన్‌పై భారత్ 58 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ తరువాత 2007లో శ్రీలంకతో జరిగిన వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక 2010 ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన భారత్.. 2011లో వెస్టిండిస్‌పై ఐదు వికెట్లతో విజయం నమోదు చేసింది. కాగా, 2013లో నవంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. భారత్ విసిరిన 289 పరుగుల లక్ష్యాన్ని విండీస్ ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. కాగా, 2014లో అక్టోబర్‌లో విండీస్ తో జరగాల్సిన వన్డే మ్యాచ్ తుపాను కారణంగా రద్దయ్యింది. -
సాధిస్తారా?..సమర్పిస్తారా?
న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ ఉత్కంఠకు చేరుకుంది. ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్‌లు గెలిచి సమంగా నిలవడంతో ఇప్పుడు ఐదో వన్డేపైనే సిరీస్ ఫలితం ఆధారపడింది. విశాఖపట్టణంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో చివరదైన ఐదో వన్డే జరుగునుంది. శనివారం మధ్యాహ్నం గం.1.30ని.లకు ఇరు జట్ల మధ్య కీలకమైన ఐదో వన్డే జరుగనుంది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌కు సిద్ధమైన భారత-న్యూజిలాండ్‌లు ఇప్పటికే తమ తమ వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఈ ఏడాది స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్ ఇదే కావడంతో భారత క్రికెట్ జట్టు ఎలాగైనా సిరీస్‌ను సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు న్యూజిలాండ్ టెస్టుల్లో ఎదురైన క్లీన్ స్వీప్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు జరిగే వన్డే మ్యాచ్ ఇరు జట్లకు ప్రతిష్టాత్మకమే. ఇరు జట్లు రేపటి తుది జట్ల విషయంలో మార్పులు చేసే అవకాశం ఉంది. ప్రత్యేకంగా న్యూజిలాండ్ జట్టులో డెవిచ్కు విశ్రాంతి నిచ్చి హెన్రీని తుది జట్టులోకి తీసుకోవచ్చు. మరోవైపు భారత జట్టులో గత మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చిన ప్రధాన బౌలర్ బూమ్రా తుది జట్టులోకి రావొచ్చు. ఒకవేళ అది జరిగితే నాల్గో వన్డేలో ఆకట్టుకున్న ధవల్ కులకర్ణికి విశ్రాంతి తప్పకపోవచ్చు.కాని పక్షంలో అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్‌లో ఒకరి విశ్రాంతినిచ్చి కులకర్ణిని ఆడించే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమం.. ఏది ఏమైనా వైజాగ్ మ్యాచ్ కీలకం కావడంతో ఇరు జట్లు పూర్తిస్థాయి ప్రదర్శనతో అభిమానులను అలరించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ఇప్పటివకూ వైజాగ్‌లో భారత జట్టు ఐదు వన్డేలు ఆడింది. ఇందులో నాలుగింట విజయం సాధించిన టీమిండియా.. ఒకదాంట్లో మాత్రమే ఓటమి పాలైంది. 2005లో ఇక్కడ జరిగిన మొట్టమొదటి వన్డేలో పాకిస్తాన్‌పై భారత్ 58 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ తరువాత 2007లో శ్రీలంకతో జరిగిన వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక 2010 ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన భారత్.. 2011లో వెస్టిండిస్‌పై ఐదు వికెట్లతో విజయం నమోదు చేసింది. కాగా, 2013లో నవంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. భారత్ విసిరిన 289 పరుగుల లక్ష్యాన్ని విండీస్ ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. కాగా, 2014లో అక్టోబర్‌లో విండీస్ తో జరగాల్సిన వన్డే మ్యాచ్ తుపాను కారణంగా రద్దయ్యింది. ఇక్కడ ధోనినే బెస్ట్ ధోని సొంత మైదానం రాంచీలో పేలవమైన రికార్డు కల్గిన మహేంద్ర సింగ్ ధోనికి వైజాగ్ స్టేడియంలో మాత్రం మంచి రికార్డే ఉంది.ఈ స్టేడియంలో 2005లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో ధోని 148 పరుగులు నమోదు చేశాడు. ఇదే ఆ స్టేడియంలో ఇప్పటివరకూ అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. దాంతో ధోని మరోసారి బ్యాట్ ను ఝుళిపించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ఈ స్టేడియంలో అత్యధిక భాగస్వామ్యం కూడా భారత జంటదే.2011లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్-రోహిత్‌ల జోడి నాల్గో వికెట్‌కు 163 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. ఇది ఇక్కడ ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం. ఈ స్టేడియంలోని గణాంకాలు.. అత్యధిక స్కోరు: 356/9(50 ఓవర్లలో)..(2005లోభారత-పాకిస్తాన్ మ్యాచ్‌లో) అత్యల్ప స్కోరు:259/7(42.2 ఓవర్లలో).. (2007లో భారత-శ్రీలంక మ్యాచ్‌లో) అత్యధిక వ్యక్తిగత స్కోరు:148-ఎంఎస్ ధోని(2005లో భారత-పాకిస్తాన్ మ్యాచ్‌లో) అత్యుత్తమ బౌలింగ్:4/60-రవి రాంపాల్(2013 భారత-వెస్టిండీస్ మ్యాచ్‌లో) అత్యధిక భాగస్వామ్యం:163, నాల్గో వికెట్‌కు రోహిత్-విరాట్ కోహ్లిల జోడి(2011లో విండీస్‌తో మ్యాచ్‌లో) అత్యధిక పరుగులు: 334, విరాట్ కోహ్లి(మూడు వన్డేల్లో) అత్యధిక వికెట్లు: ఆరు వికెట్లు, రవి రాంపాల్(రెండు వన్డేల్లో) -
ఆమ్లా, రోసౌ శతకాల మోత
* దక్షిణాఫ్రికా భారీ విజయం * విండీస్‌పై 4-1తో సిరీస్ కైవసం సెంచూరియన్: సిరీస్‌లో రెండోసారి ఓపెనర్ హషీమ్ ఆమ్లా (105 బంతుల్లో 133; 11 ఫోర్లు; 6 సిక్సర్లు), రిలీ రోసౌ (98 బంతుల్లో 132; 9ఫోర్లు; 8 సిక్సర్లు) సెంచరీల మోత మోగించడంతో వెస్టిండీస్‌తో జరిగిన ఐదో వన్డేలో దక్షిణాఫ్రికా 131 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. బుధవారం సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ప్రొటీస్ 42 ఓవర్లలో ఐదు వికెట్లకు 361 పరుగులు సాధించింది. వర్షం కారణంగా ఎనిమిది ఓవర్లు తగ్గించారు. ఆమ్లా, రోసౌ మూడో వికెట్‌కు 247 పరుగులు జోడించారు. దక్షిణాఫ్రికా తరఫున ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. రస్సెల్‌కు మూడు వికెట్లు పడ్డాయి. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన విండీస్ 37.4 ఓవర్లలో 230 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇన్నింగ్స్ తొలి బంతికే గేల్ వెనుదిరగ్గా... శామ్యూల్స్ (47 బంతుల్లో 50; 1 ఫోర్; 4 సిక్సర్లు), నర్సింగ్ డియోనరైన్ (50 బంతుల్లో 43; 5 ఫోర్లు; 1 సిక్స్) రాణించారు. వేన్ పార్నెల్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. రోసౌకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఆమ్లాకు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి. -
జో రూట్ సెంచరీ
శ్రీలంకపై ఇంగ్లండ్ గెలుపు ఐదో వన్డే పల్లెకెలె: జో రూట్ సూపర్ సెంచరీ (117 బంతుల్లో 104 నాటౌట్; 7 ఫోర్లు; 1 సిక్స్)తో శ్రీలంకతో జరిగిన ఐదో వన్డేను ఇంగ్లండ్ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెల్చుకుంది. 23 ఏళ్ల రూట్ కెరీర్లో ఇది మూడో సెంచరీ కాగా అవన్నీ ఈ ఏడాదే రావడం విశేషం. ఇంగ్లండ్ తరఫున డేవిడ్ గోవర్ (1983లో) ఒక్కరే వార్షిక క్యాలెండర్లో నాలుగు సెంచరీలు సాధిం చాడు. బుధవారం శ్రీలంక 239 పరుగులకు ఆలౌట్ అయింది. వర్షం అంతరాయం కలిగించడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను రిజర్వ్ డే గురువారం ప్రారంభించారు. 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 49.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి నెగ్గింది. 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన జట్టును రూట్ తనదైన శైలిలో ఆదుకున్నాడు. జేమ్స్ టేలర్ (90 బంతుల్లో 68; 5 ఫోర్లు; 1 సిక్స్)తో కలిసి మూడో వికెట్‌కు 104 పరుగులు జోడించిన రూట్ 115 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు. సేనానాయకేకు రెండు వికెట్లు పడ్డాయి. ఇరు జట్ల మధ్య ఆరో వన్డే ఇదే మైదానంలో 13న జరుగుతుంది. -
మనకు లార్డ్స్... వాళ్లకు లీడ్స్
-
మనకు లార్డ్స్... వాళ్లకు లీడ్స్
ఆఖరి వన్డేలో ఇంగ్లండ్‌కు ఊరట విజయం సిరీస్ 3-1తో భారత్ కైవసం రాణించిన జడేజా, రాయుడు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ రైనా ఆదివారం ఏకైక టి20 లీడ్స్: టెస్టు సిరీస్‌లో భారత్ లార్డ్స్‌లో విజయం సాధిస్తే... వన్డేల్లో ఇంగ్లండ్ లీడ్స్‌లో గెలిచింది. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కుక్ బృందం 3-1తో నెగ్గితే... వన్డే సిరీస్‌ను ధోనిసేన 3-1తో కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన చివరిదైన ఐదో వన్డేలో భారత్ 41 పరుగుల తేడాతో ఓడినా... ఓవరాల్‌గా ఈ పర్యటనలో ఆతిథ్య జట్టుపై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు లెక్క సరిజేసింది. హెడింగ్లీ మైదానంలో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 294 పరుగులు చేసింది. రూట్ (108 బంతుల్లో 113; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) కెరీర్లో రెండో సెంచరీ చేయగా, బట్లర్ (40 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కుక్ (64 బంతుల్లో 46; 6 ఫోర్లు), స్టోక్స్ (23 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. షమీ 2, భువనేశ్వర్, ఉమేశ్, అశ్విన్, రైనా తలా ఓ వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 48.4 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా (68 బంతుల్లో 87; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), అంబటి తిరుపతి రాయుడు (65 బంతుల్లో 53; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలతో చెలరేగారు. ధావన్ (44 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్), ధోని (42 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్) ఓ మోస్తరుగా ఆడాడు. స్టోక్స్ 3, అండర్సన్, అలీ, ఫిన్ తలా రెండు వికెట్లు తీశారు. రూట్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’; రైనాకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. ఇరు జట్ల మధ్య ఏకైక టి20 మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లో ఆదివారం జరుగుతుంది. చివరి వన్డేలో ఓడటంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత నంబర్‌వన్ ర్యాంక్ ప్రమాదంలో పడింది. శనివారం జరిగే ముక్కోణపు టోర్నీ ఫైనల్లో ఒకవేళ దక్షిణాఫ్రికాను ఓడిస్తే ఆస్ట్రేలియా మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంటుంది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: కుక్ (సి) ధోని (బి) రైనా 46; హేల్స్ (సి) రహానే (బి) ఉమేశ్ 4; అలీ (సి) ఉమేశ్ (బి) భువనేశ్వర్ 9; రూట్ (సి) అశ్విన్ (బి) షమీ 113; మోర్గాన్ (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 14; బట్లర్ రనౌట్ 49; స్టోక్స్ నాటౌట్ 33; వోక్స్ (బి) షమీ 9; ట్రెడ్‌వెల్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం: (50 ఓవర్లలో 7 వికెట్లకు) 294 వికెట్ల పతనం: 1-23; 2-39; 3-91; 4-117; 5-225; 6-249; 7-265 బౌలింగ్: భువనేశ్వర్ 8-0-45-1; ఉమేశ్ యాదవ్ 6-0-46-1; షమీ 10-0-52-2; అశ్విన్ 10-2-49-1; రైనా 7-0-32-1; జడేజా 9-0-66-0. భారత్ ఇన్నింగ్స్: రహానే (సి) మోర్గాన్ (బి) అండర్సన్ 0; ధావన్ (బి) అలీ 31; కోహ్లి (సి) కుక్ (బి) అండర్సన్ 13; రాయుడు (సి) కుక్ (బి) స్టోక్స్ 53; రైనా (సి) బట్లర్ (బి) అలీ 18; ధోని (సి) స్టోక్స్ (బి) ఫిన్ 29; జడేజా (బి) ఫిన్ 87; అశ్విన్ (సి) ఫిన్ (బి) స్టోక్స్ 16; భువనేశ్వర్ రనౌట్ 1; షమీ (సి) హేల్స్ (బి) స్టోక్స్ 0; ఉమేశ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (48.4 ఓవర్లలో ఆలౌట్) 253. వికెట్ల పతనం: 1-0; 2-25; 3-49; 4-91; 5-132; 6-173; 7-203; 8-208; 9-209; 10-253. బౌలింగ్: అండర్సన్ 10-0-39-2; వోక్స్ 10-1-61-0; మొయిన్ అలీ 8-0-34-2; ఫిన్ 8.4-1-37-2; ట్రెడ్‌వెల్ 5-0-35-0; స్టోక్స్ 7-0-47-3. ‘తేలికగా వికెట్లు కోల్పోవడంతో లక్ష్యాన్ని ఛేదించలేకపోయాం. నాతోపాటు ధావన్, రాయుడుల వికెట్లు పడకుంటే మ్యాచ్ మరోలా ఉండేది. చివరి 10 ఓవర్లలో విజయానికి కావాల్సిన పరుగులు చేసేవాళ్లం. ఈ పిచ్‌పై 300 తక్కువ స్కోరే. స్లాగ్ ఓవర్లలో బౌలింగ్‌ను మెరుగుపర్చుకోవాల్సి ఉంది. షమీ ఆకట్టుకున్నా మిగతా పేసర్లు గాడిలో పడాల్సి ఉంది. 77 రోజుల ఈ టూర్లో ప్రతి ఒక్కర్నీ ఫిట్‌గా ఉంచాలంటే చాలా కష్టం. ప్రపంచకప్‌కు ముందు మేం ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. కాబట్టి అందరూ పూర్తి ఫిట్నెస్తో ఉండటం చాలా ముఖ్యం.’ - ధోని (భారత కెప్టెన్) ‘ఈ మ్యాచ్‌లో బాగా ఆడాం. గతంలో ఇలా ఆడలేక ఓటమిపాలయ్యాం. రూట్ ఏం చేయగలడో అది చేసి చూపాడు. చాలాసార్లు బ్యాట్స్‌మెన్ 20, 30లకే అవుటయ్యే వాళ్లు. కానీ ఈసారి రూట్ సెంచరీ చేయడంతో గెలిచే అవకాశాలు మెరుగుపడ్డాయి. 4-0తో సిరీస్‌ను కోల్పోవద్దని భావించాం. 300 లక్ష్యాన్ని ఛేదించడం అంత సులభం కాదు. వన్డేలపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది’. -కుక్ (ఇంగ్లండ్ కెప్టెన్) -
ప్రయోగాలు చేస్తారా!
కొత్త కుర్రాళ్లను భారత్ పరీక్షించే అవకాశం నేడు ఇంగ్లండ్‌తో చివరి వన్డే మ. గం. 3.00 నుంచి స్టార్ స్పోర్ట్స్ 1, దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం సాధారణంగా భారత జట్టు విజయాల బాటలో ఉన్నప్పుడు, సిరీస్ గెలిచిన తర్వాత కూడా తుది జట్టును మార్చేందుకు ధోని-ఫ్లెచర్ ప్రయత్నించరు. క్లీన్‌స్వీప్‌పై వారి దృష్టి ఉంటుంది. అయితే ఇప్పుడు టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి కూడా వ్యూహకర్తగా ఉన్నాడు. ప్రపంచ కప్‌కు ముందు ఇంగ్లండ్ పరిస్థితుల్లో కొత్త ఆటగాళ్లను పరీక్షించాలని శాస్త్రి భావిస్తే ఆఖరి వన్డేలో భారత్ కొన్ని ప్రయోగాలు చేయొచ్చు. లీడ్స్: ఇంగ్లండ్ గడ్డపై 24 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ విజయంతో ఒక లాంఛనం ముగిసింది. టెస్టు సిరీస్‌లో పరాభవానికి టీమిండియా తమదైన శైలిలో జవాబు ఇచ్చింది. ఇక మిగిలింది ప్రత్యర్థికి ఒక్క గెలుపు కూడా దక్కకుండా చావుదెబ్బ కొట్టడమే. ఇదే లక్ష్యంతో ధోని సేన చివరి, ఐదో వన్డేకు సిద్ధమైంది. నేడు (శుక్రవారం) ఇక్కడి హెడింగ్లీ మైదానంలో జరిగే ఆఖరి వన్డేలో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. భారత్ ఇప్పటికే 3-0తో సిరీస్ గెలుచుకుంది. కాబట్టి ఓడినా పోయేదేమీ లేదు. మరోవైపు సొంతగడ్డపై కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని కుక్ బృందం భావిస్తోంది. ఐదుగురి ఎదురుచూపులు సిరీస్‌లో రహానే అద్భుతంగా ఆడుతుండగా... నాలుగో వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఫామ్‌లోకి రావడంతో మన జట్టుకు ప్రధాన సమస్య ఒకటి తీరిపోయింది. అయితే జట్టులో నంబర్‌వన్ బ్యాట్స్‌మన్ హోదాతో ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టిన విరాట్ కోహ్లి మాత్రం భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. ఇంగ్లండ్‌లో ఈసారి ఆడిన 13 ఇన్నింగ్స్‌లలో అతని అత్యధిక స్కోరు 40 మాత్రమే! చివరి వన్డేలోనైనా అతను మెరుపులు మెరిపించాలని జట్టు ఆశిస్తోంది. ఇక మిడిలార్డర్లో రైనా, రాయుడులకు మరి కొంత బ్యాటింగ్ ప్రాక్టీస్ అవసరం ఉంది. అయితే ఇప్పటివరకు అవకాశం రాకుండా బెంచ్ మీద ఐదుగురు ఆటగాళ్లు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. కరణ్‌శర్మ, శామ్సన్, విజయ్, బిన్నీ, ఉమేశ్ యాదవ్‌లలో ఎవరికి అవకాశం వస్తుందో చూడాలి. అయోమయంలో కుక్ సిరీస్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ వ్యూహ, ప్రతివ్యూహాలపై అన్ని వైపులనుంచి విమర్శలు వస్తున్నా...కుక్‌లో మాత్రం నిస్సహాయత కనిపిస్తోంది. గత మూడు వన్డేల్లో కనీస ప్రతిఘటన కూడా ఇవ్వకుండా ఇంగ్లండ్ బేలగా ఆడి చేతులెత్తేసింది. ఓపెనర్‌గా కుక్ ఘోరంగా విఫలమవుతుండగా, గత మ్యాచ్‌లో హేల్స్ కూడా రాణించలేకపోయాడు. బాలెన్స్, రూట్, మోర్గాన్‌లలో ఎవరిలోనూ ధాటిగా వన్డే ఇన్నింగ్స్ ఆడే సత్తా కనిపించడం లేదు. భారత్‌పై ఇంగ్లండ్ ఏ దశలోనూ ఒత్తిడి పెంచలేకపోయింది. ఇక స్పిన్‌ను ఎదుర్కోవడం ఇంగ్లండ్ తరం కావడం లేదు. అందరూ విఫలమవుతున్న చోట ఎవరిని తీసుకోవాలనేది కూడా సమస్యగా మారింది. ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో ఇంగ్లండ్ చివరి మ్యాచ్ నెగ్గాలంటే అద్భుతమే జరగాలి. పిచ్, వాతావరణం ఫ్లాట్ వికెట్, బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ మైదానంలో గత ఐదు వన్డేల్లో మూడు భారీ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యాయి. అయితే వాతావరణ శాఖ నివేదిక ప్రకారం శుక్రవారం వర్షం పడేందుకు 5 శాతం మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి మ్యాచ్‌కు అవరోధం కలుగకపోవచ్చు. ‘గత మూడు వన్డేల్లో మా ఆట పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. అయితే మేం ఉదాసీనంగా లేము. అదే తీవ్రతతో బరిలోకి దిగుతాం. సిరీస్‌లో గెలిచిన వన్డేలకు ఏ తరహాలో సిద్ధమయ్యామో ఈ మ్యాచ్‌కు కూడా అదే తరహాలో సిద్ధంగా ఉన్నాం. ఆరంభాన్ని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్న నా బలహీనతను గుర్తించి రవిశాస్త్రి తగిన సలహా ఇచ్చారు. ఆయన వల్లే నాలుగో వన్డేలో సెంచరీ సాధించగలిగా’ -రహానే, భారత ఆటగాడు