మనకు లార్డ్స్... వాళ్లకు లీడ్స్ | England have FINALLY clinched a MUCH-NEEDED WIN against India in the series!! | Sakshi
Sakshi News home page

మనకు లార్డ్స్... వాళ్లకు లీడ్స్

Published Sat, Sep 6 2014 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 12:55 PM

మనకు లార్డ్స్... వాళ్లకు లీడ్స్

మనకు లార్డ్స్... వాళ్లకు లీడ్స్

ఆఖరి వన్డేలో ఇంగ్లండ్‌కు ఊరట విజయం
 సిరీస్ 3-1తో భారత్ కైవసం
 రాణించిన జడేజా, రాయుడు
 ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ రైనా
 ఆదివారం ఏకైక టి20
 
 లీడ్స్: టెస్టు సిరీస్‌లో భారత్ లార్డ్స్‌లో విజయం సాధిస్తే... వన్డేల్లో ఇంగ్లండ్ లీడ్స్‌లో గెలిచింది. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కుక్ బృందం 3-1తో నెగ్గితే... వన్డే సిరీస్‌ను ధోనిసేన 3-1తో కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన చివరిదైన ఐదో వన్డేలో భారత్ 41 పరుగుల తేడాతో ఓడినా... ఓవరాల్‌గా ఈ పర్యటనలో ఆతిథ్య జట్టుపై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు లెక్క సరిజేసింది.
 
  హెడింగ్లీ మైదానంలో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 294 పరుగులు చేసింది. రూట్ (108 బంతుల్లో 113; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) కెరీర్‌లో రెండో సెంచరీ చేయగా, బట్లర్ (40 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కుక్ (64 బంతుల్లో 46; 6 ఫోర్లు), స్టోక్స్ (23 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. షమీ 2, భువనేశ్వర్, ఉమేశ్, అశ్విన్, రైనా తలా ఓ వికెట్ తీశారు.
 
 అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 48.4 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా (68 బంతుల్లో 87; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), అంబటి తిరుపతి రాయుడు (65 బంతుల్లో 53; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలతో చెలరేగారు. ధావన్ (44 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్), ధోని (42 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్) ఓ మోస్తరుగా ఆడాడు. స్టోక్స్ 3, అండర్సన్, అలీ, ఫిన్ తలా రెండు వికెట్లు తీశారు. రూట్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’; రైనాకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
 
 ఇరు జట్ల మధ్య ఏకైక టి20 మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లో ఆదివారం జరుగుతుంది. చివరి వన్డేలో ఓడటంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత నంబర్‌వన్ ర్యాంక్ ప్రమాదంలో పడింది. శనివారం జరిగే ముక్కోణపు టోర్నీ ఫైనల్లో ఒకవేళ దక్షిణాఫ్రికాను ఓడిస్తే ఆస్ట్రేలియా మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంటుంది.
 
 స్కోరు వివరాలు
 ఇంగ్లండ్ ఇన్నింగ్స్: కుక్ (సి) ధోని (బి) రైనా 46; హేల్స్ (సి) రహానే (బి) ఉమేశ్ 4; అలీ (సి) ఉమేశ్ (బి) భువనేశ్వర్ 9; రూట్ (సి) అశ్విన్ (బి) షమీ 113; మోర్గాన్ (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 14; బట్లర్ రనౌట్ 49; స్టోక్స్ నాటౌట్ 33; వోక్స్ (బి) షమీ 9; ట్రెడ్‌వెల్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు 9;  మొత్తం: (50 ఓవర్లలో 7 వికెట్లకు) 294
 వికెట్ల పతనం: 1-23; 2-39; 3-91; 4-117; 5-225; 6-249; 7-265
 బౌలింగ్: భువనేశ్వర్ 8-0-45-1; ఉమేశ్ యాదవ్ 6-0-46-1; షమీ 10-0-52-2; అశ్విన్ 10-2-49-1; రైనా 7-0-32-1; జడేజా 9-0-66-0.
 
 భారత్ ఇన్నింగ్స్: రహానే (సి) మోర్గాన్ (బి) అండర్సన్ 0; ధావన్ (బి) అలీ 31; కోహ్లి (సి) కుక్ (బి) అండర్సన్ 13; రాయుడు (సి) కుక్ (బి) స్టోక్స్ 53; రైనా (సి) బట్లర్ (బి) అలీ 18; ధోని (సి) స్టోక్స్ (బి) ఫిన్ 29; జడేజా (బి) ఫిన్ 87; అశ్విన్ (సి) ఫిన్ (బి) స్టోక్స్ 16; భువనేశ్వర్ రనౌట్ 1; షమీ (సి) హేల్స్ (బి) స్టోక్స్ 0; ఉమేశ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (48.4 ఓవర్లలో ఆలౌట్) 253.
 
 వికెట్ల పతనం: 1-0; 2-25; 3-49; 4-91; 5-132; 6-173; 7-203; 8-208; 9-209; 10-253.
 
 బౌలింగ్: అండర్సన్ 10-0-39-2; వోక్స్ 10-1-61-0; మొయిన్ అలీ 8-0-34-2; ఫిన్ 8.4-1-37-2; ట్రెడ్‌వెల్ 5-0-35-0; స్టోక్స్ 7-0-47-3.
 
 ‘తేలికగా వికెట్లు కోల్పోవడంతో లక్ష్యాన్ని ఛేదించలేకపోయాం. నాతోపాటు ధావన్, రాయుడుల వికెట్లు పడకుంటే మ్యాచ్ మరోలా ఉండేది. చివరి 10 ఓవర్లలో విజయానికి కావాల్సిన పరుగులు చేసేవాళ్లం. ఈ పిచ్‌పై 300 తక్కువ స్కోరే. స్లాగ్ ఓవర్లలో బౌలింగ్‌ను మెరుగుపర్చుకోవాల్సి ఉంది. షమీ ఆకట్టుకున్నా మిగతా పేసర్లు గాడిలో పడాల్సి ఉంది. 77 రోజుల ఈ టూర్‌లో ప్రతి ఒక్కర్నీ ఫిట్‌గా ఉంచాలంటే చాలా కష్టం. ప్రపంచకప్‌కు ముందు మేం ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. కాబట్టి అందరూ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండటం చాలా ముఖ్యం.’     - ధోని (భారత కెప్టెన్)
 
 ‘ఈ మ్యాచ్‌లో బాగా ఆడాం. గతంలో ఇలా ఆడలేక ఓటమిపాలయ్యాం. రూట్ ఏం చేయగలడో అది చేసి చూపాడు. చాలాసార్లు బ్యాట్స్‌మెన్ 20, 30లకే అవుటయ్యే వాళ్లు. కానీ ఈసారి రూట్ సెంచరీ చేయడంతో గెలిచే అవకాశాలు మెరుగుపడ్డాయి. 4-0తో సిరీస్‌ను కోల్పోవద్దని భావించాం. 300 లక్ష్యాన్ని ఛేదించడం అంత సులభం కాదు. వన్డేలపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది’.     
 -కుక్ (ఇంగ్లండ్ కెప్టెన్)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement