
దుబాయ్: దక్షిణాఫ్రికా-భారత మహిళా జట్లు మరో టీ20ని అదనంగా ఆడనున్నాయి. భారత మహిళలతో ఐదు టీ20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు వర్షార్పణం కావడంతో ఒక టీ20ని షెడ్యూల్‌లో చేర్చారు. ఇప్పటికే నాలుగు టీ20లు ముగియగా, భారత్ రెండు మ్యాచ్‌లు గెలిచి ఆధిక్యంలో ఉంది. ఐదు టీ20 శుక్రవారం జరుగనుంది. ఇదిలా ఉండగానే మరొక టీ20ని ఆడించాలని నిర్ణయించారు.
ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఒక ప్రకటనలో భారత్-దక్షిణాఫ్రికా మహిళల మధ్య మరో టీ20ని నిర్వహించనున్నట్లు తెలిపింది. వచ్చే నెల 3వ తేదీన సూరత్‌లో మ్యాచ్ జరుగనున్నట్లు పేర్కొంది. దాంతో ఐదు టీ20ల సిరీస్ కాస్తా ఆరు టీ20ల సిరీస్ అయ్యింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా గెలిచిన పక్షంలో సిరీస్ సమం అవుతుంది. అదే సమయంలో భారత్ కనీసం ఒక మ్యాచ్ గెలిచినా సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment