భారత మహిళల గెలుపు | Indian Women's Team Beat South Africa in One-Off T20I | Sakshi
Sakshi News home page

భారత మహిళల గెలుపు

Published Mon, Dec 1 2014 1:03 AM | Last Updated on Tue, Aug 28 2018 7:15 PM

భారత మహిళల గెలుపు - Sakshi

భారత మహిళల గెలుపు

దక్షిణాఫ్రికాతో టి20 మ్యాచ్
బెంగళూరు: మూడు వన్డేల సిరీస్‌లో ఓటమి పాలైన భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో మాత్రం గెలిచి ఊరట చెందింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మిథాలీ రాజ్ బృందం 16 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 146 పరుగులు చేసింది. ఓపెనర్ మిథాలీ రాజ్ (31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40), స్మృతి మందన (42 బంతుల్లో 5 ఫోర్లతో 52) ఆకట్టుకున్నారు. అనంతరం 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 130 పరుగులు సాధించి ఓటమి పాలైంది. భారత బౌలర్లలో ఏక్తా బిస్త్ (2/20), పూనమ్ యాదవ్ (3/18) రాణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement