
మనోళ్లు మిరాకిల్ చేస్తారు
నీకా.. నాకా అంటూ గురువారం ప్రారంభమైన భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో భారత్ మిరాకిల్ చేస్తుందని క్రికెట్ అభిమానులు చెప్తున్నారు.
నీకా.. నాకా అంటూ గురువారం ప్రారంభమైన భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో భారత్ మిరాకిల్ చేస్తుందని క్రికెట్ అభిమానులు చెప్తున్నారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. భారత్కు 329 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇది భారత్కు ప్రస్తుతం భారీ టార్గెట్గానే భావిస్తున్నప్పటికీ క్రికెట్ అభిమానులకు మాత్రం ఆందోళన అవసరం లేదంటున్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా అద్భుతాన్ని ఆవిష్కరిస్తుందని, విజయాన్ని సాధిస్తుందని అంటున్నారు.
ఎవరూ ఎలాంటి ఆందోళన పెట్టుకోకుండా మ్యాచ్ను ఎంజాయ్ చేయండంటూ భరోసా ఇస్తున్నారు. రోహిత్, ధవన్ ఉంటే మ్యాచ్ ఎక్కడికీ పోదని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ నిలదొక్కుకుని ఆస్ట్రేలియాను హడలెత్తిస్తాడని చెప్పారు. అతడు 120 కోట్ల భారత ప్రజలకు కింగ్ అవనున్నాడని అభిప్రాయపడ్డారు. అతడు సెంచరీ చేయడం ఖాయమంటూ లక్ష్య ఛేదనకు దిగిన భారత్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. భారత్ చరిత్ర సృష్టించడం ఖాయం అన్నారు.