న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్ వ్యవహారంపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన ప్యానెల్ కార్యరంగంలోకి దిగింది. ఈ విషయంపై ఎవరిదగ్గరైనా కీలక సమారం ఉంటే తమకు మెయిల్ చేయాల్సిందిగా కోరింది. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ముకుల్ ముద్గల్ నేతృత్వంలో ఈ త్రిసభ్య ప్యానెల్ పనిచేస్తుంది.
గురునాథ్‌పై గతంలో బీసీసీఐ ఏర్పాటు చేసిన ద్విసభ్య కమిటీకి వ్యతిరేకంగా బీహార్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) సుప్రీంలో కేసు వేసిన సంగతి తెలిసిందే. దీని ఆధారంగా గురునాథ్ వ్యవహారంపై తిరిగి సుప్రీం కోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. గురునాథ్ గురించి ఎవరిదగ్గరైనా అతి కీలక సమాచారం ఉంటే వారిని సభ్యులు వ్యక్తిగతంగా ఆహ్వానించి కలుస్తారు. వీరి వివరాలను కమిటీ గోప్యంగా ఉంచనుంది. కమిటీ పనితీరు గురించి పూర్తి వివరాలను త్వరలోనే బీసీసీఐకి పంపుతామని ఈ త్రిసభ్య కమిటీ కార్యదర్శి విదుష్‌పత్ సింఘానియా తెలిపారు.
మెయ్యప్పన్ గురించి తెలిసింది చెప్పండి
Published Fri, Oct 25 2013 1:33 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement