ఆఖరి బంతికి సిక్సర్‌తో... | Ireland victory over the Netherlands | Sakshi
Sakshi News home page

ఆఖరి బంతికి సిక్సర్‌తో...

Published Mon, Feb 18 2019 2:16 AM | Last Updated on Mon, Feb 18 2019 2:16 AM

Ireland victory over the Netherlands - Sakshi

అల్‌ అమారత్‌ (ఒమన్‌):  నాలుగు దేశాల టి20 సిరీస్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌ ఒక వికెట్‌ తేడాతో గెలిచింది. ముందుగా నెదర్లాండ్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. టొబియాస్‌ విసీ (36 బంతుల్లో 78; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగాడు. అనంతరం ఐర్లాండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 183 పరుగులు చేసింది. ఆండీ బల్బిర్నీ (50 బంతుల్లో 83; 12 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. చివరి ఓవర్లో ఐర్లాండ్‌ విజయానికి 12 పరుగులు అవసరం కాగా... తొలి 5 బంతుల్లో 6 పరుగులు చేసిన జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఆఖరి బంతికి సిక్స్‌ కొడితే గానీ విజయం సాధించలేని స్థితిలో స్టువర్ట్‌ పాయింటర్‌ బంతిని మైదానం దాటించాడు. అంతర్జాతీయ టి20ల్లో చివరి బంతికి సరిగ్గా ఆరు పరుగులు కావాల్సి ఉండగా సిక్సర్‌ కొట్టి ఒక జట్టు మ్యాచ్‌ గెలవడం ఇదే తొలిసారి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement