ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన పఠాన్‌ | Irfan Pathan All Round Show In Road Safety World Series In Mumbai | Sakshi
Sakshi News home page

ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన పఠాన్‌

Published Wed, Mar 11 2020 11:08 AM | Last Updated on Wed, Mar 11 2020 11:26 AM

Irpan Pathan All Round Show In Road Safety World Series In Mumbai - Sakshi

ముంబై : ఇర్ఫాన్‌ పఠాన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో భారత జట్టు సునాయాస విజయాన్ని చేజెక్కించుకుంది. అదేంటి పఠాన్‌ ఈ మధ్యనే ఆటకు వీడ్కోలు పలికాడుగా.. మ్యాచ్‌ ఎప్పుడు ఆడాడనేగా మీ సందేహం.. ఏం లేదండి రోడ్‌ సేప్టీపై అవగాహన పెంచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వరల్డ్‌ రోడ్‌ సేప్టీ సిరీస్‌ నిర్వహిస్తోంది. ఈ సిరీస్‌లో పలువురు భారత మాజీ ఆటగాళ్లు ఆడుతున్నారు. కాగా ఇండియా లెజెండ్స్‌ జట్టుకు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో శ్రీలంక లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
(సెహ్వాగ్‌ అదే బాదుడు)

ముందుగా బ్యాటింగ్‌ దిగిన శ్రీలంక లెజెండ్స్‌ మునాఫ్‌ పటేల్‌ 4 వికెట్లతో రాణించడంతో  20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. 139 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా లెజెండ్స్‌ ఆదిలోనే సచిన్‌(0), సెహ్వాగ్‌(3) వికెట్లను కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన యూవీ(1) కూడా అవుటవడంతో   5 ఓవర్లో 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సంజయ్‌బంగర్‌, కైఫ్‌లు కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. అయితే బంగర్‌, కైఫ్‌లు వెనువెంటనే వెనుదిరగడంతో ఇండియా లెజెండ్స్‌ 5 వికెట్లు కోల్పోయింది. (క్లార్క్‌కు వచ్చిన నష్టం ఏంటో ?)

ఈ దశలో క్రీజలోకి వచ్చిన ఇర్ఫాన్‌ పఠాన్‌ మన్‌ప్రీత్‌ గోని సహాయంతో చెలరేగిపోయాడు. పఠాన్‌ ఇన్నింగ్స్‌లో  6 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. కాగా పఠాన్‌ 31 బంతుల్లోనే 57 పరుగులు చేసి ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు. అంతకుముందు బౌలింగ్‌ వేసిన పఠాన్‌ కీలకమైన తిలకరత్నే దిల్షాన్‌ వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా శనివారం వాంఖేడే స్టేడియం వేదికగా ఇండియా లెజెండ్స్‌- వెస్టిండీస్‌ లెజెండ్స్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సెహ్వాగ్‌ వీర బాదుడుతో ఇండియా లెజెండ్స్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. (ఆ పంచ్‌లకు సచిన్‌ మురిసిపోయాడు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement