గోవాను వణికించిన నార్త్‌ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీ | ISL 2016, NorthEast United (NEUFC) 2-0 FC Goa: As it happened | Sakshi
Sakshi News home page

గోవాను వణికించిన నార్త్‌ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీ

Published Wed, Oct 5 2016 12:06 AM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

గోవాను వణికించిన నార్త్‌ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీ

గోవాను వణికించిన నార్త్‌ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీ

గువాహటి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో నార్త్‌ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. మంగళవారం ఎఫ్‌సీ గోవాతో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు 2-0తో నెగ్గింది. ఈ రెండు గోల్స్‌ను స్టయికర్ ఎమిలియానో అల్ఫరోనే (20, 62వ నిమిషాల్లో) చేశాడు. ఆట ప్రారంభమైన 12వ నిమిషంలోనే నార్త్‌ఈస్ట్‌కు గోల్ చేసే అవకాశం దక్కింది. కోఫీ క్రిస్టియాన్ క్రాస్‌ను కట్సుమి యుసా గోల్ పోస్టులోకి పంపే లోపే కీపర్ లక్ష్మికాంత్ కట్టిమాని డైవింగ్ చేసి అడ్డుకున్నాడు.
 
 అయితే 20వ నిమిషంలో అల్ఫరో జట్టు తరఫున బోణీ చేశాడు. గోవా కెప్టెన్ లూసియో బ్యాక్‌పాస్‌ను తమ కీపర్ వైపు అందించగా అతడు బంతిని అందుకునేందుకు ముందుకు రాకుండా అక్కడే వెయిట్ చేయడంతో అల్ఫరో ఈలోపే వేగంగా స్పందించి దాన్ని గోల్‌గా మలిచాడు. ద్వితీయార్ధంలోనూ గోవా తమ దూకుడును ప్రదర్శించింది. అయితే సమష్టిగా ఆడిన నార్త్‌ఈస్ట్‌కు 62వ నిమిషంలో అల్ఫరో మరో అద్భుత గోల్ చేసి విజయాన్ని ఖాయం చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement