ఫుట్‌బాల్ జట్టుపై ధోని దృష్టి | John Abraham, Mahendra Singh Dhoni may buy IMG-Reliance football franchise | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్ జట్టుపై ధోని దృష్టి

Published Thu, Aug 29 2013 2:00 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

John Abraham, Mahendra Singh Dhoni  may buy IMG-Reliance football franchise

న్యూఢిల్లీ: ఫుట్‌బాల్‌ను అమితంగా ఇష్టపడే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోని... ఒక జట్టును కొనాలనే ఆలోచనలో ఉన్నాడు. భారత్‌లో త్వరలో ఐపీఎల్ తరహాలో ఫుట్‌బాల్ లీగ్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ కొత్త లీగ్‌లో ఓ ఫ్రాంచైజీని సొంతం చేసుకోవాలని మహీ భావిస్తున్నట్లు సమాచారం.

బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం, ధోని కలిసి జట్టును కొనే అవకాశం ఉందని లీగ్ వర్గాలు తెలిపాయి. ‘ధోని, జాన్ మంచి స్నేహితులు. ఈ లీగ్‌లో పెట్టుబడి పెట్టేందుకు జాన్ ఇప్పటికే బాగా ఆసక్తి చూపుతున్నాడు. ధోనితో కలిసి టీమ్ కొనాలని అనుకుంటున్నాడు’ అని లీగ్ వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి మార్చి 30 లోపు ఈ లీగ్ జరిగే అవకాశం ఉంది. ఇందులో పాల్గొనే జట్ల కోసం సెప్టెంబరులో వేలం నిర్వహిస్తారు. మరోవైపు ఇదే లీగ్‌లో కోల్‌కతా జట్టును కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు షారూఖ్ ఖాన్ గతంలో చెప్పాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement