తాత్కాలిక కోచ్గా లాంగర్ | Justin Langer to take temporary charge of Australia T20 team | Sakshi
Sakshi News home page

తాత్కాలిక కోచ్గా లాంగర్

Published Fri, Dec 9 2016 1:45 PM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM

తాత్కాలిక కోచ్గా లాంగర్

తాత్కాలిక కోచ్గా లాంగర్

సిడ్నీ:ఆస్ట్రేలియా ట్వంటీ 20 క్రికెట్ జట్టుకు తాత్కాలిక కోచ్గా జస్టిన్ లాంగర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇలా ఆస్ట్రేలియా ట్వంటీ 20 జట్టుకు కొంత కాలం కోచ్గా లాంగర్ వ్యవరించడం ఇది రెండోసారి. త్వరలో భారత్లో పర్యటించే ఆస్ట్రేలియా జట్టు నాలుగు  టెస్టు  మ్యాచ్లు ఆడనుంది. అదే సమయంలో ఆస్ట్రేలియాలో టీ 20 సిరీస్ జరుగనుంది. దాంతో ప్రధాన ఆటగాళ్లు మాత్రమే భారత్లో పర్యటనకు రానున్నారు.

 

భారత్ కు వచ్చే ఆసీస్ జట్టుకు డారెన్ లీమన్ కోచ్గా వ్యవహరించనుండగా, ఆ క్రమంలో ఆసీస్ టీ 20 జట్టుకు లాంగర్ కోచింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తాడు .ఫిబ్రవరి 23వ తేదీన పుణెల్ ఆసీస్-భారత్ల తొలి టెస్టు మ్యాచ్తో సిరీస్ ఆరంభం కానుంది. ఇదిలా ఉండగా, అదే నెల్లో ఆస్ట్రేలియా-శ్రీలంక జట్ల మధ్య టీ 20 సిరీస్ ఆరంభం కానుంది. ఫిబ్రవరి 17వ తేదీన ఆసీస్-శ్రీలంక జట్లు మధ్య  తొలి టీ 20 జరుగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement