విలియమ్సన్ అరుదైన ఘనత
న్యూఢిల్లీ:భారత్ తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో విలియమ్సన్ సెంచరీ సాధించడంతో వన్డేల్లో భారత్పై భారత్లో శతకం నమోదు చేసిన నాల్గో కివీస్ ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు ఈ ఘనతను సాధించిన వారిలో నాధన్ ఆస్టలే (5 సెంచరీలు), రాస్ టేలర్(2 సెంచరీలు), మార్టిన్ క్రో(2 సెంచరీలు) మాత్రమే ఉన్నారు.
ఇది విలియమ్సన్ కెరీర్లో ఎనిమిదో వన్డే సెంచరీ కాగా, భారత్ పై తొలి వన్డే సెంచరీ. మరొకవైపు ఇది భారత్ పై వన్డేల్లో న్యూజిలాండ్ కెప్టెన్లు చేసిన మూడో సెంచరీగా రికార్డుకు ఎక్కింది.