యువీకి జనాభిమానం ఎక్కువ | Kapil Dev, 'complete batsman' yuvaraj singh | Sakshi
Sakshi News home page

యువీకి జనాభిమానం ఎక్కువ

Published Thu, Dec 24 2015 2:40 AM | Last Updated on Mon, May 28 2018 2:10 PM

యువీకి జనాభిమానం ఎక్కువ - Sakshi

యువీకి జనాభిమానం ఎక్కువ

న్యూఢిల్లీ: టి20 జట్టులో డాషింగ్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్‌ను చేర్చడాన్ని బౌలింగ్ దిగ్గజం కపిల్ దేవ్ స్వాగతించారు. జాన్ మెకన్రో, మారడోనాలాగా యువీకి జనాభిమానం చాలా ఎక్కువని అభివర్ణించారు. ‘యువీ చాలా ఉత్సాహవంతమైన క్రికెటర్. మెకన్రో, మారడోనాలాగే తనకీ అభిమానులు చాలా ఎక్కువ. కేవలం వీళ్ల ఆటను చూడటానికే జనాలు వస్తారు.
 
 యువరాజ్ కూడా ఆ కోవలోకే వస్తాడు. తన బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో అభిమానులను మైదానానికి రప్పిస్తాడు. అందుకే అతను నిఖార్సైన మ్యాచ్ విన్నర్. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు’ అని కపిల్ పేర్కొన్నారు. టి20 జట్టుకు ధోనిని కెప్టెన్‌గా నియమించడం, పేసర్ల పట్ల విరాట్ దృక్పథాన్ని కూడా ఈ మాజీ ఆల్‌రౌండర్ ప్రశంసించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement