
గువాహటి: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి దూకుడు కొనసాగిస్తున్నాడు. 35 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ సాధించి మరోసారి సత్తాచాటాడు. 323 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్(4) రెండో ఓవర్‌లోనే పెవిలియన్ చేరాడు.
ఆ తరుణంలో రోహిత్ శర్మకు జత కలిసిన కోహ్లి వచ్చీ రావడంతోనే బ్యాట్‌కు పనిచెప్పాడు. ఒకవైపు రోహిత్ శర్మ కుదురుగా బ్యాటింగ్ చేస్తే, కోహ్లి మాత్రం బౌండరీల మోత మోగించాడు. తనదైన శైలిలో మెరుపులు మెరిపిస్తూ అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. దాంతో టీమిండియా 13 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 90 పరుగులు చేసి ధీటుగా బదులిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment