మెల్‌బోర్న్: ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టచ్‌లోకి వచ్చాడనుకునే లోపే వికెట్ సమర్పించుకున్నాడు. ఆడమ్ జంపా బౌలింగ్‌లో సిక్స్ కొట్టి ఊపు మీద కనిపించిన కోహ్లి.. ఆ మరుసటి బంతికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. జంపా ఊరిస్తూ వేసిన బంతిని ఆడలా.. వద్దా అనే సందిగ్థంలో కోహ్లి వికెట్ ఇచ్చేశాడు. ఫలితంగా వన్డేల్లో, టీ20ల్లో కలిపి ఆరోసారి జంపాకు ఆరోసారి ఔటయ్యాడు కోహ్లి. ఇది ఈ రెండు ఫార్మాట్ల పరంగా ఒక బ్యాట్స్‌మన్‌ను అత్యధిక సార్లు జంపా ఔట్ చేసిన ఘనతగా నమోదైంది. జంపాకు ఆరుసార్లు కోహ్లి చిక్కితే, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని, కేదార్ జాదవ్, దాసున్ షనకా(శ్రీలంక)లు తలో మూడుసార్లు పెవిలియన్ చేరారు.
అయితే కోహ్లి ఔట్ అవ్వడానికి కారణాన్ని ఆసీస్ దిగ్గజం స్టీవ్ వా తనదైన శైలిలో విశ్లేషించాడు. ‘ ఎక్కువసార్లు జంపాకు ఔటైన కోహ్లి అతన్ని ఆచితూచి ఆడాల్సింది. కాకపోతే అతని బౌలింగ్‌లో దూకుడును ప్రదర్శించాడు. అసలు జంపాకు గౌరవం ఇవ్వకుండా బ్యాటింగ్ చేశాడు. జంపా కూడా ప్రధాన బౌలరే అనే విషయాన్ని కోహ్లి మరిచాడు. నిజంగా జంపాను సమర్థవంతంగా ఎదుర్కోవాలనే ఆలోచనే ఉంటే కోహ్లి అలా బ్యాటింగ్ చేసి ఉండేవాడు. జంపా బౌలింగ్ వేసే సమయంలో కోహ్లి కాస్త నిర్లక్ష్యం వహించాడు. అందుకే మూల్యం చెల్లించుకున్నాడు’ అని స్టీవ్ వా అభిప్రాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment