![Kohli placed in Top 10 for Most Fifty Plus Scores - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/17/virat-kohli.jpg.webp?itok=96VFPaFh)
లీడ్స్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన క్లబ్‌లో చేరిపోయాడు. వన్డేల్లో అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన జాబితాలో కోహ్లి పదో స్థానాన్ని ఆక్రమించాడు. ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో కోహ్లి హాఫ్ సెంచరీ సాధించాడు. 56 బంతుల్లో అర్థ శతకం నమోదు చేసిన కోహ్లి.. వన్డేల్లో యాభైకి పైగా పరుగుల్ని 83 సార్లు సాధించాడు. ఫలితంగా టాప్-10లో కోహ్లి నిలిచాడు. ఈ క‍్రమంలోనే వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా(82) రికార్డును కోహ్లి బ‍్రేక్ చేశాడు. కోహ్లి సాధించిన 83 అత్యధిక యాభైకి పైగా స్కోర‍్లలో 35 సెంచరీలు ఉండగా, 48 హాఫ్ సెంచరీలున్నాయి.
ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (145) తొలి స్థానంలో ఉండగా, సంగక్కార(118) రెండో స్థానంలో ఉన్నాడు. ఆపై రికీ పాంటింగ్(112), కల్లిస్(103), మహేల జయవర్ధనే(96), జయసూర్య(96), రాహుల్ ద్రవిడ్(95), సౌరవ్ గంగూలీ(94), ఇంజమాముల్ హక్(93)లు ఉన్నారు. ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో కోహ్లి(71; 72 బంతుల్లో 8 ఫోర్లు) నాల్గో వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
Comments
Please login to add a commentAdd a comment