లండన్: ప్రపంచకప్‌లో ఏ జట్టును తక్కువ అంచనా వేయడం లేదని టీమిండియా సారథి విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. దాయాది పాకిస్తాన్‌పై విజయం అనంతరం ఆటగాళ్లు సేదతీరుతున్నారు. అయితే టీమిండియా తదుపరి మ్యాచ్‌లో శనివారం అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. అఫ్గాన్ మ్యాచ్‌ను లైట్ తీసుకోవద్దని పాక్ మాజీ బౌలర్ వసీం ఆక్రమ్ పేర్కొన్న నేపథ్యంలో కోహ్లి పై వ్యాఖ్యలు చేశాడు. ప్రతీ మ్యాచ్‌ను గెలవాలనే ఉద్దేశంతో బరిలోకి దిగుతామని, అఫ్గాన్‌తో సహా ఏ జట్టును తేలిగ్గా తీసుకోమని స్పష్టం చేశాడు.
‘అఫ్గాన్‌ను ఎందుకు సీరియస్‌గా తీసుకోమని అనుకుంటున్నారు. ప్రపంచకప్‌లో ప్రతీ మ్యాచ్ కీలకమే. అఫ్గాన్‌తో సహా ఏ జట్టును తక్కువ అంచనా వేయడం లేదు. వారిదైన రోజు వాళ్లు విరుచుకపడతారు. ప్రతీ మ్యాచ్ గెలవాలనే పోరాడతాం. మాకు రెండు మ్యాచ్‌ల మధ్య గ్యాప్ ఉండటం ఎంతో సానుకూలాంశం. ఈ ఖాళీ సమయంలో ఆటగాళ్లు పునరుత్తేజాన్ని పొందుతారు. ఇక మాపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండేందుకు డ్రెస్సింగ్‌రూమ్, ప్రాక్టీస్ సెషన్‌లలో ఉల్లాసంగా ఉండటానికి ప్రయత్నిస్తాం. ఇప్పటివరకు మేము అనుకున్న వ్యూహాలు కచ్చితంగా అమలు చేయడంతో విజయాలు సాధిస్తున్నాం. ఆటగాళ్లు ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ప్రపంచకప్‌లోని మిగతా మ్యాచ్‌ల్లోనూ ఇలాగే పోరడతాం’ అంటూ కోహ్లి పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment