లక్ష్య సేన్‌ ఖాతాలో ఐదో టైటిల్‌ | Lakshya Sen Wins Bangladesh International Challenge | Sakshi
Sakshi News home page

లక్ష్య సేన్‌ ఖాతాలో ఐదో టైటిల్‌

Dec 16 2019 1:23 AM | Updated on Dec 16 2019 9:47 AM

Lakshya Sen Wins Bangladesh International Challenge - Sakshi

ఢాకా: భారత యువ షట్లర్‌ లక్ష్య సేన్‌ ఈ ఏడాదిని మరో టైటిల్‌తో ముగించాడు. ఆదివారం ముగిసిన బంగ్లాదేశ్‌ ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ బ్యాడ్మింటన్‌ టోరీ్నలో 18 ఏళ్ల లక్ష్య సేన్‌ విజేతగా నిలిచాడు. ఫైనల్లో ఉత్తరాఖండ్‌కు చెందిన లక్ష్య సేన్‌ 22–20, 21–18తో లియోంగ్‌ జున్‌ హావో (మలేసియా)పై విజయం సాధించాడు. తాను పాల్గొన్న గత ఏడు టోర్నీలలో లక్ష్య సేన్‌ ఐదు టోరీ్నలలో చాంపియన్‌గా నిలువడం విశేషం. బెల్జియం ఓపెన్, డచ్‌ ఓపెన్, సార్లార్‌లక్స్‌ ఓపెన్, స్కాటిష్‌ ఓపెన్‌ టోరీ్నల్లో లక్ష్య సేన్‌ టైటిల్స్‌ సాధించాడు. మహిళల డబుల్స్‌లో కె.మనీషా–రితూపర్ణ (భారత్‌) ద్వయం... పురుషుల డబుల్స్‌లో ఎం.ఆర్‌.అర్జున్‌–ధ్రువ్‌ కపిల జంట రన్నరప్‌గా నిలిచాయి. ఫైనల్స్‌లో మనీషా–రితూపర్ణ జోడీ 20–22, 19–21తో తాన్‌ పియర్లీ కూంగ్‌ లీ–థినా మురళీథరన్‌ (మలేసియా) ద్వయం చేతిలో... అర్జున్‌–ధ్రువ్‌ జంట 19–21, 16–21తో యీ జున్‌ చాంగ్‌–కై వున్‌ తీ        (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement