జకార్తా: ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత యువ సంచలనం లక్ష్య సేన్ విజేతగా అవతరించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో లక్ష్యసేన్ 21-19, 21-18 తేడాతో టాప్‌సీడ్ కున్‌లవుత్ వితిద్‌సరన్ (థాయ్‌లాండ్)పైవిజయం సాధించి చాంపియన్‌గా నిలిచాడు. ఏకపక్షంగా సాగిన పోరులో లక్ష్యసేన్ కడవరకూ పోరాడి గెలిచాడు. 46 నిమిషాల పాటు జరిగిన పోరులో లక్ష్యసేన్.. కున్‌లవుత్‌ను మట్టికరిపించి ఐదు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు.
ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో భారత జట్టు చివరిసారి 1965లో పసిడి పతకాన్ని గెలిచింది. 53 ఏళ్ల క్రితం గౌతమ్ థక్కర్ ఈ కేటగిరీలో స్వర్ణాన్ని గెలవగా, సుదీర్ఘ కాలం తర్వాత లక్ష్య సేన్ ఆ ఘనతను సాధించి రికార్డు పుస్తకాల్లోకికెక్కాడు. కాగా, ఓవరాల్‌గా ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పసిడి గెలిచిన మూడో భారత్ ప్లేయర్‌గా లక్ష్య సేన్ నిలిచాడు. 2012లో జరిగిన చాంపియన్‌షిప్ పీవీ సింధు స్వర్ణ పతకాన్ని గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment