
గ్లాస్గో: స్కాటిష్ ఓపెన్ సూపర్–100 ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా భారత యువ షట్లర్ లక్ష్యసేన్ నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో లక్ష్యసేన్ 18–21, 21–18, 21–19తో యోర్ కోహెల్‌హో (బ్రెజిల్)పై విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకున్నాడు. తొలి గేమ్ ఓడినా... తర్వాతి రెండు గేమ్‌లను సొంతం చేసుకున్న లక్ష్యసేన్ టైటిల్ హస్తగతం చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment