
హైలో ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగం నుంచి భారత నంబర్‌వన్ లక్ష్య సేన్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు.
జర్మనీలో మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 8వ ర్యాంకర్ లక్ష్య సేన్ 12–21, 5–21తో ప్రపంచ 15వ ర్యాంకర్ ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు.
భారత్‌కే చెందిన స్టార్ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, సమీర్ వర్మ, సైనా నెహ్వాల్ తమ తొలి రౌండ్ మ్యాచ్‌లను నేడు ఆడనున్నారు.
చదవండి: T20 WC 2022: బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్.. టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్