న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ లక్ష్యసేన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన సెమీస్‌లో మలేషియాకు చెందిన ప్రపంచ 60వ ర్యాంకర్ యోంగ్‌ను 19-21, 21-16, 21-12 తేడాతో ఓడించి తుది పోరుకు అర్హత సాధించాడు.
FIRST SUPER 5️⃣0️⃣0️⃣ FINAL! ✅✅🔥👏
— BAI Media (@BAI_Media) January 15, 2022
Kudos @lakshya_sen ! 👏🔝#YonexSunriseIndiaOpen2022#IndiaKaregaSmash#Badminton pic.twitter.com/FM5kWQlPbe
ఫైనల్స్‌లో సింగపూర్ ఆటగాడు, ప్రపంచ నంబర్ వన్ లో కియా యూతో సమరానికి సిద్ధమాయ్యాడు. ప్రపంచ 17వ ర్యాంకర్ లక్ష్యసేన్.. క్వార్టర్‌ఫైనల్లో సహచర భారత షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్‌పై 14-21, 21-9, 21-14 తేడాతో గెలిచి సెమీస్‌కు చేరాడు. కాగా, ఈ టోర్నీలో కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్ప సహా ఏడుగురు భారత షట్లర్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
చదవండి: చరిత్ర సృష్టించిన భారత షట్లర్.. సింధు, సైనాలకు సాధ్యం కాని ఘనత సొంతం
Comments
Please login to add a commentAdd a comment