India Open Super Series tournament
-
India Open: ఫైనల్స్‌కు దూసుకెళ్లిన లక్ష్య సేన్
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ లక్ష్యసేన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన సెమీస్‌లో మలేషియాకు చెందిన ప్రపంచ 60వ ర్యాంకర్ యోంగ్‌ను 19-21, 21-16, 21-12 తేడాతో ఓడించి తుది పోరుకు అర్హత సాధించాడు. FIRST SUPER 5️⃣0️⃣0️⃣ FINAL! ✅✅🔥👏Kudos @lakshya_sen ! 👏🔝#YonexSunriseIndiaOpen2022#IndiaKaregaSmash#Badminton pic.twitter.com/FM5kWQlPbe— BAI Media (@BAI_Media) January 15, 2022 ఫైనల్స్‌లో సింగపూర్ ఆటగాడు, ప్రపంచ నంబర్ వన్ లో కియా యూతో సమరానికి సిద్ధమాయ్యాడు. ప్రపంచ 17వ ర్యాంకర్ లక్ష్యసేన్.. క్వార్టర్ఫైనల్లో సహచర భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్‌పై 14-21, 21-9, 21-14 తేడాతో గెలిచి సెమీస్‌కు చేరాడు. కాగా, ఈ టోర్నీలో కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్ప సహా ఏడుగురు భారత షట్లర్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. చదవండి: చరిత్ర సృష్టించిన భారత షట్లర్.. సింధు, సైనాలకు సాధ్యం కాని ఘనత సొంతం -
ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్, సింధు
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు శుభారంభం చేశారు. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో వీరిద్దరూ తొలి రౌండ్లో అలవోకగా గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. టాప్ సీడ్ శ్రీకాంత్ 21–17, 21–10తో సిరిల్ వర్మ (భారత్)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సింధు 21–5, 21–16తో కుదరవల్లి శ్రీకృష్ణప్రియ (భారత్)పై గెలిచింది. భారత్‌కే చెందిన అష్మిత చాలియా 24–22, 21–16తో ఐదో సీడ్ ఎవగెనియా కొసెత్‌స్కాయా (రష్యా)పై సంచలన విజయం సాధించింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గాయత్రి గోపీచంద్–త్రిషా జాలీ (భారత్) జంట 21–12, 21–10తో ప్రొజొరోవా–రుదకోవా (ఉక్రెయిన్) జోడీపై నెగ్గి ముందంజ వేసింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో గాయత్రి గోపీచంద్–సాయిప్రతీక్ (భారత్) ద్వయం 21–16, 16–21, 21–17తో ఇషాన్ భట్నాగర్–తనీషా క్రాస్టో (భారత్) జోడీపై... సిక్కి రెడ్డి–ధ్రువ్ కపిల (భారత్) జంట 21–11, 21–11తో చిరాగ్ అరోరా–నిషు రాప్రియా (భారత్) ద్వయంపై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. -
ఇంట గెలిచేనా!
► సింధు, సైనా సత్తాకు పరీక్ష ► మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు నేటి నుంచి ► ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ న్యూఢిల్లీ: ఏడాది కాలంగా అద్వితీయ ఫామ్‌లో ఉన్న పీవీ సింధు స్వదేశంలో తనకు అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను అందుకోవాలనే లక్ష్యంతో పోరును ప్రారంభించనుంది. బుధవారం మొదలయ్యే మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌ల్లో భాగంగా మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత్‌కే చెందిన అరుంధతి పంతవానెతో సింధు తలపడనుంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఐదుసార్లు పోటీపడిన సింధు ఒకసారి సెమీఫైనల్‌కు (2013) చేరగా... రెండుసార్లు తొలి రౌండ్లో (2011, 2014) నిష్క్రమించింది. మరో రెండుసార్లు క్వార్టర్ ఫైనల్లో (2012, 2016) వెనుదిరిగింది. అయితే ఈసారి మాత్రం టైటిలే లక్ష్యంగా ఈ హైదరాబాద్ స్టార్ బరిలోకి దిగింది. మరోవైపు ఏడోసారి ఈ టోర్నీలో అడుగుపెడుతున్న మాజీ చాంపియన్ సైనా నెహ్వాల్‌కు ఈ టోర్నీ పరీక్షగా నిలువనుంది. తొలి రౌండ్లో ప్రపంచ 39వ ర్యాంకర్ చియా సిన్ లీ (చైనీస్ తైపీ)తో సైనా ఆడనుంది. తొలి రెండు రౌండ్లను సైనా, సింధు అధిగమిస్తే క్వార్టర్ ఫైనల్లో ముఖాముఖిగా తలపడతారు. సైనా, సింధులతోపాటు మెయిన్ ‘డ్రా’లో భారత్‌కే చెందిన శ్రీకృష్ణప్రియ, తులసి, రీతూపర్ణ దాస్, తన్వీ లాడ్ నేరుగా బరిలోకి దిగనున్నారు. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి ఏకంగా ఆరుగురు క్రీడాకారులు పోటీపడుతున్నారు. బుధవారం జరిగే తొలి రౌండ్లో నిషిమోటో (జపాన్)తో సాయిప్రణీత్; సన్ వాన్ హో (కొరియా)తో సమీర్ వర్మ; జావో జున్‌పెంగ్ (చైనా)తో శ్రీకాంత్; అక్సెల్సన్ (డెన్మార్క్)తో జయరామ్; ప్రణయ్‌తో సౌరభ్ వర్మ పోటీపడతారు. మెయిన్ ‘డ్రా’కు సాయి ఉత్తేజిత మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు, రసిక రాజే, అనురా ప్రభుదేశాయ్, శ్రేయాన్షి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందారు. క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో ఉత్తేజిత 21–7, 21–8తో దీపాలిపై, రసిక 21–18, 21–16తో ఆకర్షిపై, అనురా 21–13, 21–14తో దెబోరాపై, శ్రేయాన్షి 21–12, 18–21, 21–10తో వైదేహిపై గెలిచారు. -
సెమీస్‌లో సైనా తడబాటు
లీ జురుయ్ చేతిలో 11వ సారి ఓటమి ఇండియా ఓపెన్‌లో ముగిసిన భారత్ పోరు న్యూఢిల్లీ: కీలకదశలో తప్పిదాలు చేసిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మూల్యం చెల్లించుకుంది. ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోనే నిష్ర్కమించింది. గతేడాది విజేతగా నిలిచిన ఈ హైదరాబాద్ అమ్మాయి ఈసారి టైటిల్ పోరుకు చేరుకోవడంలో విఫలమైంది. తన చిరకాల ప్రత్యర్థి లీ జురుయ్ (చైనా)తో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సైనా 20-22, 21-17, 19-21తో పోరాడి ఓడిపోయింది. గంటా 12 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో సైనా నిర్ణాయక మూడో గేమ్‌లో ఆరంభం నుంచి 19వ పాయింట్ వరకు తన ఆధిక్యాన్ని కాపాడుకుంటూ వచ్చింది. అయితే లీ జురుయ్ 18-19తో వెనుకబడిన దశలో వరుసగా మూడు పాయింట్లు సాధించి సైనా ఓటమిని ఖాయం చేసింది. లీ జురుయ్ చేతిలో సైనాకిది వరుసగా ఏడో ఓటమి. ఓవరాల్‌గా 11వ పరాజయం కావడం గమనార్హం. తన కెరీర్లో ఓ క్రీడాకారిణి చేతిలో సైనా 11 సార్లు ఓడిపోవడం ఇదే ప్రథమం. ఇంతకుముందు యిహాన్ వాంగ్ (చైనా) చేతిలో సైనా అత్యధికంగా 10 సార్లు ఓటమి చవిచూసింది. సైనా చివరిసారి 2012 ఇండోనేసియా ఓపెన్‌లో లీ జురుయ్‌పై గెలిచింది. ఆ తర్వాత ఈ చైనా ప్లేయర్‌ను ఓడించడంలో సైనా విఫలమైంది. -
సైనా, శ్రీకాంత్‌లకు సవాల్
► డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి ► నేటి నుంచి ఇండియా ఓపెన్ న్యూఢిల్లీ: సొంతగడ్డపై గతేడాది ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. మంగళవారం మొదలయ్యే ఈ మెగా టోర్నమెంట్లో ఈ ఇద్దరూ డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగుతున్నారు. తొలి రోజు కేవలం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లుంటాయి. బుధవారం నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో శ్రీకాంత్‌కు క్లిష్టమైన డ్రా పడింది. తొలి రౌండ్లో అతను ప్రపంచ ఏడో ర్యాంకర్ తియాన్ హువీ (చైనా)తో తలపడతాడు. ముఖాముఖి రికార్డులో శ్రీకాంత్ 1-5తో వెనుకంజలో ఉన్నాడు. శ్రీకాంత్‌తోపాటు మెయిన్ ‘డ్రా’లో సాయిప్రణీత్, అజయ్ జయరామ్, ప్రణయ్ ఉన్నారు. క్వాలిఫయింగ్‌లో గురుసాయిదత్, సమీర్ వర్మ, ఆనంద్ పవార్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. స్టార్ ఆటగాళ్లు లీ చోంగ్ వీ (మలేసియా), లిన్ డాన్ (చైనా), కెంటో మొమోటా (జపాన్), జార్గెన్‌సన్, విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) కూడా టైటిల్ రేసులో ఉన్నారు. ఇక మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ సైనాకు కాస్త సులువైన ‘డ్రా’ ఎదురైంది. తొలి రౌండ్లో ఆమె క్వాలిఫయర్‌తో ఆడనుంది. సైనా ముందంజ వేస్తే క్వార్టర్స్‌లో ఐదో సీడ్ సుంగ్ జీ హ్యున్ (కొరియా), సెమీస్‌లో లీ జురుయ్ (చైనా) లేదా షిజియాన్ వాంగ్ (చైనా)లలో ఒకరితో ఆడాల్సి ఉంటుంది. మరోవైపు పీవీ సింధు తొలి రౌండ్లో జినైన్ కికాగ్ని (ఇటలీ)తో తలపడనుంది. ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్‌తో సింధు ఆడాల్సి ఉన్నా మారిన్ చివరి నిమిషంలో వైదొలిగింది. దాంతో మారిన్ స్థానంలో కికాగ్నికి చోటు లభించింది. -
‘నంబర్‌వన్’కు చేరువగా...
ఇండియా ఓపెన్ సెమీస్‌లో సైనా శ్రమించి నెగ్గిన శ్రీకాంత్ పోరాడి ఓడిన ప్రణయ్, గురుసాయిదత్ లిన్ డాన్‌కు సుగియార్తో షాక్ న్యూఢిల్లీ: స్వదేశంలో జరిగే ఏకైక సూపర్ సిరీస్ టోర్నీ ఇండియా ఓపెన్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది. గతంలో ఆడిన నాలుగు పర్యాయాల్లో ఒక్కసారి కూడా క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించ లేకపోయిన ఈ హైదరాబాద్ అమ్మాయి... ఐదో ప్రయత్నంలో మాత్రం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అంతేకాకుండా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌కు విజయం దూరంలో నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సైనా 21-15, 21-12తో హనా రమాధిని (ఇండోనేసియా)పై నెగ్గి తొలిసారి ఇండియా ఓపెన్‌లో సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనాకు తొలి గేమ్‌లో కాస్త పోటీ ఎదురైంది. రెండో గేమ్‌లో మాత్రం సైనా స్పష్టమైన ఆధిపత్యం చలాయించింది. ఈ గేమ్‌లో ఇద్దరి స్కోర్లు ఒక్కసారి కూడా సమం కాలేదు. సైనాతోపాటు రెండో సీడ్ కరోలినా మారిన్ (స్పెయిన్), మూడో సీడ్ ఇంతనోన్ రత్చనోక్ (థాయ్ లాండ్), యు హాషిమోటో కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించారు. శనివారం జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 37వ ర్యాంకర్ యు హాషిమోటో (జపాన్)తో సైనా ఆడుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో గెలిస్తే సైనా వచ్చే గురువారం విడుదల చేసే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తాజా ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటుంది. 1980లో ప్రకాశ్ పదుకొనే తర్వాత ఇప్పటివరకు భారత్ నుంచి ఎవ్వరూ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోలేదు. హాషిమోటోతో ముఖాముఖి రికార్డులో సైనా 0-1తో వెనుకబడి ఉంది. 2013 ఇండియా ఓపెన్ రెండో రౌండ్లో హాషిమోటోతో ఆడిన ఏకైక మ్యాచ్‌లో సైనా మూడు మ్యాచ్ పాయింట్లను వదులుకొని ఓడిపోవడం గమనార్హం. నాడు ఎదురైన ఓటమికి ఈసారి సైనా లెక్క సరిచేస్తుందో లేదో వేచి చూడాలి. పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రపంచ 23వ ర్యాంకర్ టకూమా ఉయెదా (జపాన్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ శ్రీకాంత్ 79 నిమిషాల్లో 21-15, 23-25, 21-18తో కష్టపడి గెలుపొందాడు. శనివారం జరిగే సెమీఫైనల్లో క్వాలిఫయర్ జుయ్ సాంగ్ (చైనా)తో శ్రీకాంత్ ఆడతాడు. మరోవైపు భారత్‌కే చెందిన గురుసాయిదత్, ప్రణయ్ పోరాడి ఓడారు. క్వార్టర్ ఫైనల్స్‌లో గురుసాయిదత్ 21-15, 18-21, 13-21తో జుయ్ సాంగ్ చేతిలో; ప్రణయ్ 21-16, 9-21, 18-21తో ఆరో సీడ్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓటమి చవిచూశారు. పురుషుల సింగిల్స్‌లో టైటిల్ ఫేవరెట్, చైనా దిగ్గజం లిన్ డాన్‌కు క్వార్టర్ ఫైనల్లో ఊహించని పరాజయం ఎదురైంది. ఎనిమిదో సీడ్ టామీ సుగియార్తో (ఇండోనేసియా) అద్భుత ఆటతీరును కనబరిచి 21-17, 15-21, 21-17తో ప్రపంచ మూడో ర్యాంకర్ లిన్ డాన్‌ను ఇంటిముఖం పట్టించాడు. సెమీస్‌లో అక్సెల్సన్తో సుగియార్తో తలపడతాడు. -
సైనా శుభారంభం
న్యూఢిల్లీ: ఫైనల్‌కు చేరితే ‘నంబర్‌వన్’ ర్యాంక్ ఖాయం కానున్న నేపథ్యంలో... భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సైనా 21-5, 21-13తో క్వాలిఫయర్ రియా ముఖర్జీ (భారత్)పై గెలిచింది. కేవలం 28 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనాకు ఏదశలోనూ పోటీ ఎదురుకాలేదు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో తెలుగు అమ్మాయి గద్దె రుత్విక శివానితో సైనా తలపడుతుంది. తొలి రౌండ్లో రుత్విక 21-7, 21-6తో క్వాలిఫయర్ రుచా నికమ్ (భారత్)పై నెగ్గింది. పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ కిడాంబి శ్రీకాంత్‌తోపాటు హైదరాబాద్‌కే చెందిన పారుపల్లి కశ్యప్, గురుసాయిదత్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో శ్రీకాంత్ 21-17, 21-16తో సెన్సోమ్బూన్సుక్ (థాయ్‌లాండ్)పై, కశ్యప్ 16-21, 21-19, 21-18తో సు జెన్ హావో (చైనీస్ తైపీ)పై, గురుసాయిదత్ 21-14, 17-21, 23-21తో లీ డాంగ్ కున్ (కొరియా)పై గెలిచారు. భారత్‌కే చెందిన క్వాలిఫయర్ సమీర్ వర్మ 21-15, 21-17తో ప్రపంచ 9వ ర్యాంకర్ విటిన్‌గస్ (డెన్మార్క్)పై సంచలన విజయం సాధించగా... తెలుగు కుర్రాడు సాయిప్రణీత్ 4-21, 18-21తో అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు.