ముంబై: మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని టీమిండియా టి-20 ప్రపంచ కప్ సమరానికి బయల్దేరనుంది. బంగ్లాదేశ్లో జరిగే ఈ మెగా ఈవెంట్ కోసం ధోనీసేన శుక్రవారం వెళ్లనుంది. ఇటీవల బంగ్లాదేశ్లోనే జరిగిన ఆసియా కప్లో భారత్ ఫైనల్ ముందే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. కెప్టెన్ ధోనీ గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవడం యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ జట్టుకు సారథ్య వహించాడు.
ఆరంభ టి-20 ప్రపంచ కప్లో టీమిండియా విజేతగా నిలిచింది. తాజా టోర్నీలో భారత్ తొలి మ్యాచ్ను ఈ నెల 21న పాకిస్థాన్తో తలపడనుంది. అంతకుముందు శ్రీలంక, ఇంగ్లండ్లతో వామప్ మ్యాచ్లు ఆడనుంది.
పొట్టి ప్రపంచ కప్ కోసం భారత్ పయనం
Published Mon, Mar 10 2014 8:32 PM | Last Updated on Sat, Sep 2 2017 4:33 AM
Advertisement
Advertisement