
రెండో రౌండ్‌లో మనోజ్ కుమార్
బాకు (అజర్‌బైజాన్): ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయింగ్ పురుషుల బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్ మనోజ్ కుమార్ (64 కేజీలు) శుభారంభం చేశాడు. శుక్రవారం జరిగిన తొలి రౌండ్‌లో మనోజ్ 2-1తో డానిలిటో (ప్యూర్టోరికో)పై నెగ్గాడు. 52 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన గౌరవ్ బిధురి తొలి రౌండ్‌లో ఓడిపోయాడు. వర్గాస్ (అమెరికా) 3-0తో గౌరవ్‌ను ఓడించాడు.
ఈ టోర్నీలో ఓడినప్పటికీ గౌరవ్‌కు వచ్చే నెలలో ప్రొఫెషనల్ బాక్సర్లకు జరిగే టోర్నీ ద్వారా ఒలింపిక్స్‌కు అర్హత పొందేందుకు వీలుంది. టోర్నీ తొలి రోజు గురువారం భారత్‌కు మిశ్రమ ఫలి తాలు లభించాయి. 60 కేజీల విభాగంలో ధీరజ్ 3-0తో అల్ఫోన్సో (గ్వాటెమాలా)పై గెలుపొందగా... 69 కేజీల విభాగంలో మన్‌దీప్ జాంగ్రా 1-2తో యుబా సిసోఖో (స్పెయిన్) చేతిలో ఓడాడు.