
ఢిల్లీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ‍్యూస్ శతకం సాధించాడు. సోమవారం మూడో రోజు ఆటలో మాథ్యూస్ సెంచరీ నమోదు చేశాడు. 231 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో శతకం సాధించాడు. 57 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన మాథ్యూస్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది మాథ్యూస్‌కు ఎనిమిదో టెస్టు సెంచరీ.
మరొకవైపు మరో ఓవర్ నైట్ ఆటగాడు చండిమాల్ హాఫ్ సెంచరీతో మాథ‍్యూస్‌కు చక్కటి సహకారం అందిండంతో లంకేయులు తిరిగి తేరుకున్నారు. 131/3 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం ఇన్నింగ్స్ ను ఆరంభించిన వీరిద్దరూ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ క‍్రమంలో మాథ్యూస్ శతకాన్ని, చండిమాల్ హాఫ్ సెంచరీని సాధించారు. ఈ జోడి 136 అజేయ పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో లంక జట్టు 81.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఈ రోజు ఆటలో దాదాపు 35 ఓవర్లు బౌలింగ్ వేసిన భారత బౌలర్లు ఒక్క వికెట్‌ను కూడా సాధించలేకపోయారు.