జడేజా.. ఇక గడ్డి కోసే పనిలో ఉండు..! | Michael Vaughan Trolls Ravindra Jadeja Over Sword Wielding Video | Sakshi
Sakshi News home page

జడేజా.. ఇక గడ్డి కోసే పనిలో ఉండు..!

Published Mon, Apr 13 2020 10:08 AM | Last Updated on Mon, Apr 13 2020 10:12 AM

Michael Vaughan Trolls Ravindra Jadeja Over Sword Wielding Video - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా కత్తిసాము గురించి తెలియని వారుండరు. రాజ వంశానికి చెందిన ఈ సౌరాష్ట్ర క్రికెటర్‌ హాఫ్‌ సెంచరీ, సెంచరీ చేసిన సందర్భాల్లో కానీ, ఏమైనా అరుదైన ఘనతల్ని సాధించినప్పుడు కానీ బ్యాట్‌తో కత్తిసాము చేయడం అంటే పరిపాటి. దీన్ని ఒకానొక సందర్భంలో ఆసీస్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ కూడా అనుకరించే యత్నం చేశాడు. గతేడాది ఐపీఎల్‌లో భాగంగా ఓ ప్రకటనలో నటించే క్రమంలో జడేజా తరహాలో బ్యాట్‌తో కత్తిసాము చేశాడు వార్నర్‌. ఆ వీడియోను ఇటీవల వార్నర్‌ షేర్‌ చేసుకున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా అభిమానుల్ని అలరించాలనే ఉద్దేశంతో ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. (అచ్చం జడేజాలాగే తిప్పానా.. మీరే చెప్పండి)

కాగా, ఈసారి జడేజా నిజమైన కత్తిని బయటకు తీశాడు.  తన ఇంటి ఆవరణలోని లాన్‌లో కత్తితో ప్రాక్టీస్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు.  ‘కత్తి దాని పదును కోల్పోవచ్చు.. కానీ తన సహజత్వంలో ఎప‍్పటికీ మాస్టరే’ అంటూ కామెంట్‌ చేశాడు. ఇది ఇంగ్లండ్‌ మాజీ  కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ కంటబడటంతో వెంటనే ట్రోల్‌ చేసేశాడు. ఇప్పుడు ఆ కత్తితో ఏం చేస్తావ్‌.. ఇది నువ్వు  గడ్డి కోసే  సమయం రాక్‌స్టార్‌’ అంటూ కామెంట్‌ చేశాడు. అంటే ఇంటి లాన్‌లోని గడ్డిని ఆ కత్తితో కట్‌ చేయమంటూ వాన్‌ సరదాగా చమత్కరించాడు. దీనికి జడేజా అంగీకరిస్తూనే తనకు గడ్డిని కట్‌ చేయడం రాదంటూ బదులిచ్చాడు. ‘ అసలు నాకు గడ్డి కోయడంలో అనుభవం లేదు. ఎలా కట్‌ చేయాలో తెలియదు’ అని కౌంటర్‌ ఇచ్చాడు. మైకేల్‌ వాన్‌ దగ్గర గడ్డిని కట్ చేయడం ఎలానో నేర్చుకుంటే పోలా అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.(16 ఏళ్లయినా ఆ రికార్డును కొట్టలేకపోయారు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement