సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ-ఐటా) జాతీయ జూనియర్ టాలెంట్ సిరీస్ టోర్నమెంట్‌లోని అండర్-14 బాలికల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు మిరిక జైస్వాల్, ధ్రుతి కపూర్ ఫైనల్లోకి ప్రవేశించారు. బోయినపల్లిలోని పల్లవి స్కూల్ మైదానంలో మంగళవారం జరిగిన సెమీఫైనల్స్‌లో మిరిక 6-3, 6-4తో సంస్కృతిపై, ధ్రుతి 6-3, 7-6 (7/5)తో సాహితి రెడ్డిపై గెలిచారు.
క్వార్టర్ ఫైనల్స్‌లో మిరిక 9-8తో తటవర్తి శ్రేయపై, సంస్కృతి 9-3తో నమిరెడ్డి అవని రెడ్డిపై, ధ్రుతి కపూర్ 9-6తో కొత్తకోట అనన్యపై, సాహితి రెడ్డి 9-3తో వినీతపై నెగ్గారు. అండర్-14 బాలుర సింగిల్స్ సెమీఫైనల్స్‌లో ఆదిత్య కల్లేపల్లి 6-3, 6-2తో హర్ష శ్రీపై, ప్రలోక్ ఇక్కుర్తి 7-5, 6-2తో రాజా కృష్ణతేజ (తమిళనాడు)పై గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టారు. క్వార్టర్ ఫైనల్స్‌లో ఆదిత్య 9-0తో కుర్వా గౌరవ్‌పై, హర్ష శ్రీ 9-7తో షేక్ రిఫత్పై, రాజా కృష్ణతేజ 9-5తో గన్నవరం రాఘవ్‌పై, ప్రలోక్ 9-4తో కొసరాజు హర్షిత్‌పై విజయం సాధించారు.
ఫైనల్లో మిరిక, ధ్రుతి
Published Wed, Nov 27 2013 12:12 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement