ట్వంటీ 20 సిరీస్ కు దూరం!
కరాచీ: వరల్డ్ ఎలెవన్ తో మంగళవారం నుంచి ఆరంభమయ్యే మూడు ట్వంటీ 20ల సిరీస్ కు పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ ఆమిర్ దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. వచ్చేవారం ఆమిర్ భార్య లండన్ లో బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆమిర్ తన భార్య వద్ద ఉండాలనుకుంటున్నాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అనుమతి తీసుకుని లండన్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు.
మరొకవైపు ట్వంటీ 20 సిరీస్ ఆడేందుకు ప్రపంచ ఎలెవన్ జట్టు పాక్ కు చేరుకుంది. డుప్లెసిస్ సారథ్యంలోని జట్టు లాహోర్ లో అడుగుపెట్టింది. ట్వంటీ 20 సిరీస్ కు దాదాపు తొమ్మిది వేల మంది భద్రతా సిబ్బందిని వినియోగిస్తున్నారు. మూడు ట్వంటీ 20లు లాహోర్ లో జరుగనున్నాయి. తొలి మ్యాచ్ మంగళవార జరుగనుండగా, రెండో మ్యాచ్ బుధవారం జరుగనుంది. శుక్రవారం మూడో మ్యాచ్ ను నిర్వహించనున్నారు.