రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్ మన్ మోయిసెస్ హెన్రీక్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
హైదరాబాద్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్ మన్ మోయిసెస్ హెన్రీక్స్ అర్ధ సెంచరీ సాధించాడు. 20 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ బాదాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
హెన్రీక్స్ వీరబాదుడుతో హైదరాబాద్ స్కోరు పరుగులు పెట్టింది. బెంగళూరు ఫీల్డర్ల వైఫల్యాన్ని సొమ్ము చేసుకుని అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అతడు ఇచ్చిన రెండు క్యాచ్ లను ఆర్ సీబీ ఫీల్డర్లు వదిలేశారు. రనౌట్ నుంచి కూడా తప్పించుకున్నాడు. అటు వార్నర్ కూడా వేగంగా ఆడడంతో హైదరాబాద్ స్కోరు 100 పరుగులు దాటింది.