కొత్త స్కోరింగ్ విధానంతో మరింత ఆదరణ: ప్రకాశ్ పదుకొనె
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కోరింగ్ పద్ధతి వల్ల ఈ ఆటకు మరింత ప్రేక్షకాదరణ లభిస్తుందని భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొనె అభిఫ్రాయపడ్డారు.
జనవరి 1న మొదలయ్యే పీబీఎల్–2లో 11 పాయింట్ల స్కోరింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. తక్కువ పాయింట్ల కారణంగా మ్యాచ్‌లో కచ్చితమైన ఫేవరెట్‌లు ఉండరని... ఎవరికైనా విజయావకాశాలు ఉంటాయని... దీంతో ఆట చూసేవారిలో ఆసక్తి అంతకంతకూ పెరుగుతుందని ఆయన అన్నారు.