కోహ్లీ కెప్టెన్సీ ఆశలు గల్లంతు! | MS Dhoni as indian captain for first test against australia! | Sakshi
Sakshi News home page

కోహ్లీ కెప్టెన్సీ ఆశలు గల్లంతు!

Published Sat, Dec 6 2014 4:42 PM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM

కోహ్లీ కెప్టెన్సీ ఆశలు గల్లంతు!

కోహ్లీ కెప్టెన్సీ ఆశలు గల్లంతు!

ముంబై: టెస్టు జట్టుకు తొలిసారి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాలనుకున్న టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ ఆశలు గల్లంతయ్యినట్లే కనబడుతోంది. ఈ నెల 9 వ తేదీ నుంచి అడిలైడ్ లో జరిగే తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సిద్దం కావడంతో కోహ్లీ కెప్టెన్సీ ఆశలకు గండిపడే అవకాశం ఏర్పడింది. ముందు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం తొలిటెస్టు డిసెంబర్ 4 వ తేదీన బ్రిస్బేన్ లో జరగాలి. ధోనీ చేతికి గాయం కావడంతో తొలిటెస్టు బాధ్యతలను కోహ్లీకి అప్పచెబుతూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

 

ఆసీస్ క్రికెటర్ ఫిలిఫ్ హ్యూస్ మరణంతో మొత్తం షెడ్యూల్ మొత్తం సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకోవడంతో ఆ టెస్టు 9 వ తేదీకి వాయిదా పడింది. ఈలోపు తొలిటెస్టుకు ధోనీ సిద్దం కావడంతో పాటు ఫిట్ నెస్ పరీక్షల్లో పాస్ కావడంతో కోహ్లీ టెస్టు కెప్టెన్సీ ఆశ  ఇప్పట్లో నెరవేరేటట్లు కనబడుట లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement