విరాట్ కోహ్లీనే కెప్టెన్! | virat Kohli to captain India, Clarke fit to lead Australia | Sakshi
Sakshi News home page

విరాట్ కోహ్లీనే కెప్టెన్!

Published Mon, Dec 8 2014 10:31 AM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM

విరాట్ కోహ్లీనే కెప్టెన్!

విరాట్ కోహ్లీనే కెప్టెన్!

అడిలైడ్: రేపట్నుంచి అడిలైడ్ లో ఆరంభం కానున్న తొలి టెస్టు మ్యాచ్ కు విరాట్ కోహ్లీనే టీమిండియా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని శనివారం జట్టుతో కలిసినా.. అతని చేతి గాయం పూర్తిగా నయం కాకపోవడంతో తొలిటెస్టుకు అందుబాటులో ఉండటం లేదు.  దీంతో కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని కోహ్లీ స్వయంగా వెల్లడించాడు. మంగళవారం నుంచి జరిగే టెస్ట్ మ్యాచ్ కు తానే బాధ్యతలు చేపట్టబోతున్నట్లు ప్రకటించాడు.

 

ఇదిలా ఉండగా ఆసీస్ కు కెప్టెన్ గా వ్యవహరించేందుకు మైకేల్ క్లార్క్ సిద్ధమయ్యాడు. గత ప్రాక్టీస్ మ్యాచ్ లకు ముందు క్లార్క్ కు నిర్వహించిన ఫిట్ నెస్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో కొంత సందిగ్ధత ఏర్పడింది. అయితే తాజాగా క్లార్క్ ఫిట్ నెస్ ను నిరూపించుకుని పూర్తి స్థాయిలో బరిలో దిగడానికి సిద్దంగా ఉన్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement