
పాక్‌తో మ్యాచ్: ధోనీ బౌలింగ్ ప్రాక్టీస్!
లండన్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్‌గా టీమిండియా బరిలోకి దిగుతోంది. దీంతో వరుసగా రెండో ట్రోఫీని నెగ్గాలని విరాట్ కోహ్లీ సేన తీవ్ర భావిస్తోంది. ఈ టోర్నీలో భాగంగా జూన్ 4న భారత్ తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. నెట్స్‌లో ప్రాక్టీస్ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బౌలర్‌గా కొత్త అవతారం ఎత్తాడు. నెట్ సెషన్‌లో బ్యాటింగ్ చేస్తున్న ఆటగాళ్లకు ధోనీ బంతులేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
గతంలో కొన్ని మ్యాచ్‌ల్లో ధోనీ బౌలింగ్ వేసిన విషయం తెలిసిందే. ఓ స్టిక్ సాయంతో ధోనీ సైడ్ ఆర్మ్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. అయితే పటిష్టమైన బౌలింగ్ లైనప్ ఉన్నా.. ధోనీ బంతిని చేతపట్టి బౌలింగ్ చేయడం అతడి అభిమానులలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. జూన్ 4న జరగనున్న మ్యాచ్‌లో ధోనీ బౌలర్‌గానూ అద్బుతాలు చేస్తాడేమోనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా టోర్నీలో పాక్‌పై గెలిచి శుభారంభం చేయాలని భావిస్తోంది.
We have seen him bowling - and now @msdhoni is throwing with side-arm #TeamIndia #CT17 #INDvPAK pic.twitter.com/NPMUsCWGQ2
— BCCI (@BCCI) 1 June 2017