ధోనీకి ఉద్వాసన తప్పదా..? | MS dhoni to be removed from Indian Captaincy | Sakshi
Sakshi News home page

ధోనీకి ఉద్వాసన తప్పదా..?

Published Fri, Sep 11 2015 12:07 AM | Last Updated on Sun, Sep 3 2017 9:08 AM

ధోనీకి ఉద్వాసన తప్పదా..?

ధోనీకి ఉద్వాసన తప్పదా..?

(వెబ్సైట్ ప్రత్యేకం)
తను ఆడిందే ఆటగా సాగిన మహేంద్ర సింగ్ ధోనీకీ ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది.. కొహ్లీ ని ప్రమోట్ చేయడం వెనక... బోర్డు రాజకీయాలే కారణమా..? ధోనీ.. శ్రీని మనిషనే బ్రాండే .. కెప్టెన్ కూల్ కొంప ముంచుతోందా..? ధోనీని టీమిండియా నుంచి సాగనంపడానికి రంగం సిద్ధమైందా..? విరాట్ కోహ్లీకి పూర్తిస్ధాయిలో కెప్టెన్సీ ఇవ్వడానికి బీసీసీఐ ప్లాన్ చేస్తోందా...? రానున్న సౌతాఫ్రికా సిరీస్ నే ముహుర్తంగా ఎంచుకున్నారా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

2019 ప్రపచ కప్ దృష్టి లో పెట్టుకుని టీమిండియా లో మార్పులు చేర్చులు జరుగుతున్నాయని.. గత కొంత కాలంగా.. బీసీసీఐ వర్గాలు చెబతున్నాయి. ఇప్పుడు అదే మంత్రాన్ని కెప్టెన్సీ విషయంలోనూ వల్లె వేసే పరిస్థితి కనిపిస్తోంది. రానున్న దక్షిణ ఆఫ్రికా సిరీస్ కు ధోనికి బదులు విరాట్ కొహ్లీని కెప్టెన్ గా ఎంపిక చేసే దిశగా.. బీసీసీఐ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది జరిగే ట్వంటీ సిరీస్ వరకు ధోనీకి విశ్రాంతి ఇచ్చి.. కోహ్లీని కెప్టెన్సీ ఇచ్చే అంశంపై బీసీసీఐ కసరత్తు చేస్తోంది. ఇవన్నీ నిజమైతే ధోనీ కెరీర్ ముగిసినట్టే. లేదంటే.. ధోనీ ని టీ20 కెప్టెన్‌గా మాత్రం కొనసాగించే అవకాశం ఉంది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో భారత క్రికెట్‌కు ప్రత్యేక గుర్తింపు, అనేక విజయాలు సాధించిపెట్టిన ధోనీకి ఈ కష్టాకాలం ఎందుకొచ్చింది. 2011లో శ్రీనివాసన్ బీసీసీఐ పగ్గాలు చేపట్టాక.. అతడి స్వంత ఐపీఎల్ టీమ్ లో ధోనీ భాగస్వామిగా మారాడు.

అప్పటి నుంచి ధోనీ వ్యవహార శైలి మారిపోయిందంటారు. బోర్డును .. టీమిండియాను అప్రతిహతంగా ఏలాడు. అయితే అవినీతి ఆరోపణలతో.. బోర్డునుంచి.. శ్రీని నిష్క్ర మించడంతో ధోనీకి కష్టాలు ప్రారంభమయ్యాయి. శ్రీనివాసన్‌తో వ్యక్తిగతంగానూ..  వ్యాపార సంబంధాలు ఉన్న ధోనీని పక్కన పెట్ట సాగింది. దీనికి తోడు పేవలమైన ఫాం,  ఆస్టేలియా పర్యటనలో టీమిండియా ఘోర పరాజయంతో.. టెస్టు కెప్టెన్ బాధ్యతల నుంచి ధోని తప్పుకోవాల్సి వచ్చింది. అవకాశం లభించడంతో  సెలక్టర్లు ఆలస్యం చేయకుండా టెస్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని ఎంపిక చేశారు. ఇక  శ్రీలంక టెస్టు సిరిస్‌లో  టీమిండియా దున్నేయడంతో.. కొహ్లీ పాతుకు పోయాడు.

ప్రస్తుతం టీమిండియాలో ధోనీ వికెట్ కీపర్‌గా.. మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే.. ఐపీఎల్ పుణ్యమా అని బోలెడు మంది యంగ్‌స్టర్లు జట్టులో ఛాన్స్ కోసం పోటీ పడుతున్నారు. దీంతో, ధోనీపై వత్తిడి పెరుగుతోంది. నిజానికి ధోనీ గొప్ప వికెట్ కీపరేమీ కాదు. బ్యాటింగ్‌ టాలెంటే  అతన్ని ఇంతకాలం కాపాడింది.  అయితే.. ఇదే ఇప్పుడు ధోనీకి ఇబ్బందిగా మారుతోంది.. మిస్టర్ కూల్ ను టెన్షన్ పెడుతోంది. పేవల ఫామ్ తో ఇక ఎంతో కాలం టీమ్ ను అంటి పెట్టుకుని ఉండటం సాధ్యం కాదు..


నిజానికి ఏడాదిన్నర నుంచీ, వన్డే ఫార్మాట్‌లో కెప్టెన్ మారాలనే వాదన బలంగా వినిపిస్తోంది. ధోనీ ప్లేస్‌లో కోహ్లీకి ఛార్జ్ ఇవ్వమని మాజీ క్రికెటర్లు బీసీసీఐకి చాలా సందర్భాల్లో సూచించారు. విరాట్ దూకుడుకు, వన్డే ఫార్మాట్ కు కరెక్టర్ అని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ కప్ తర్వాత..  బంగ్లాదేశ్‌లో వన్డే సిరీస్‌ను ఓడిపోవడంతో ఈ వాదన మరో సారి ముందుకు వచ్చింది.

మరి కొద్ది రోజుల్లో  మొదలు కానున్న సౌతాఫ్రికా సిరీస్‌ టీమిండియాకు కీలకం. దీంతో సెలక్టర్ల లో ఒక వర్గం విరాట్‌కు అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ ఇవ్వాలన్న వాదనను తెరపైకి తెస్తోంది. దీనికితోడు, శ్రీలంక టూర్ యంగ్ కెప్టెన్ కు ఫుల్‌ మార్కులు పడేలా చేసింది. టెస్టుల్లో దూకుడు వద్దంటున్న వాళ్లూ.. వన్డేల్లో విరాట్ మనస్థత్వాన్ని సమర్ధిస్తున్నారు. దీనికి తోడు కెప్టెన్‌గానూ రెండు వన్డే సిరీస్‌లను అందించాడు కోహ్లీ. అగ్రిసివ్‌గా ఉన్నా.. అపారమైన టాలెంట్ ఉంది కాబట్టి కోహ్లీకి మైనస్ మార్కులేమీ లేవు. అదే, ఇతన్ని వన్డేల్లోనూ కెప్టెన్‌గా చేయాలన్న వాదనను బలపరుస్తోంది.

ఏదేమైనా, క్రికెటర్‌గా కాకున్నా కెప్టెన్‌గా ధోనీ కెరీర్ ముగింపుకొచ్చింది. వచ్చే ఏడాది జరిగే టీ 20 వరల్డ్‌ కప్ తర్వాత, కెప్టెన్సీపై ఓ నిర్ణయం తీసుకుంటానని ఇంతకు ముందే చెప్పాడు... కానీ , సెలక్టర్లు అంతవరకూ ఆగేలా కనిపించడం లేదు.. ఒకప్పుడు దిగ్గజ ఆటగాళ్లను ఎలా అయితే.. బలవంతంగా టీమ్ నుంచి ఉద్వాసన పలికాడో.. సరిగ్గా అలాంటి స్ధితిలో ధోనీ ఉండటం యాదృచ్చికం మాత్రం కాదు.. అయితే.. టీమిండియా కలలో కూడా ఊహించని కప్పులు.. దిగ్గజాలకు కూడా సాధ్యం కాని విజయాలు సాధించి పెట్టిన ధోనీకి గౌరవ ప్రదంగా తప్పుకునే అవకాశం ఇవ్వాలనేది సగటు క్రికెట్ ప్రేమికుడి కోరిక.. మరి సెలక్టర్ లు ఎలా స్పందిస్తారో చూడాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement