చెన్నై విజయలక్ష్యం 203
కోల్ కతా: ఐపీఎల్-8 లో భాగంగా ఇక్కడ ఈడెన్ గార్డెన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న ఫైనల్ పోరులో ముంబై ఇండియన్స్ 203 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. పార్దీవ్ పటేల్ డకౌట్ రూపంలో ఆదిలో వెనుదిరిగినా.. కెప్టెన్ రోహిత్ శర్మ(50), సిమ్మన్స్(68) అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుని ముంబై భారీ స్కోరు చేయడంలో సహకరించారు.
ఇరువురూ కలిసి రెండో వికెట్ కు 119 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే ఈ ఇద్దరు 120 పరుగుల వద్ద నిష్ర్కమించడంతో ముంబై స్కోరు కాస్త మందగించింది. అయితే మధ్యలో పొలార్డ్(36), అంబటి రాయుడు (36), హర్భజన్ సింగ్(6) పరుగులు చేయడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో బ్రేవోకు రెండు వికెట్లు లభించగా, డ్వేన్ స్మిత్ ,మోహిత్ శర్మ లకు తలో వికెట్ లభించింది. తొలుత టాస్ గెలిచిన చెన్నై.. ముంబై ఇండియన్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.