రోహిత్ సేన లక్ష్యం 152
బెంగళూరు: ఐపీఎల్-9లో భాగంగా బుధవారమిక్కడ ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. బౌలింగ్కు అనుకూలించిన పిచ్పై బెంగళూరు ఓపెనర్లు విరాట్ కొహ్లీ (7 పరుగులు), క్రిస్గేల్ (5 పరుగులు) ఇద్దరూ విఫలమయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్, ఎబీ డివిలియర్స్ ఆచితూచి ఆడుతూ బెంగళూరు ఇన్నింగ్ను చక్కదిద్దారు. తొలి 10 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు రెండు వికెట్ల నష్టానికి 60 పరుగులకు చేరింది.
ఈ క్రమంలో ఏబీ డివిలియర్స్(27 బంతుల్లో 24 పరుగులు) పాండ్యా బౌలింగ్లో వెనుదిరిగినా రాహుల్(53 బంతుల్లో 68, నాటౌట్) సంయమనంతో బ్యాటింగ్ చేస్తూ వాట్సన్(14 బంతుల్లో 15)తో కలిసి ఇన్నింగ్స్ను నడిపించాడు. చివర్లో సచిన్ బేబి(13 బంతుల్లో 25 పరుగులు, నాటౌట్) మెరవడంతో ముంబై ముందు బెంగళూరు 152 పరుగుల టార్గెట్ను ఉంచింది. ముంబై బౌలర్లలో సౌథీ, మెక్క్లెనగన్, పాండ్యాలకు ఒక్కో వికెట్ చొప్పున దక్కింది.